రాజమౌళి డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ హీరోగా సినిమా.. ఆ రీజన్ వల్లే ఆగిపోయిందట!

తెలుగు ప్రేక్షకులకు దివంగత హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఉదయ్ కిరణ్ (uday kiran)భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రమే ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.

ఆయన సినిమాల రూపంలో ఇంకా మన మధ్యనే ఉన్నారు.ఉదయ్ కిరణ్ ఒకప్పుడు నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా భారీగా గుర్తింపుని తెచ్చుకున్నారు.

ఉదయ్ కిరణ్ (uday kiran)నటించిన సినిమాలన్నీ కూడా లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన విషయం తెలిసిందే.మొదటి సినిమాతోనే భారీగా గుర్తింపును తెచ్చుకున్నాడు.

అంతేకాకుండా అప్పట్లో లవర్ బాయ్(Lover Boy) గా ఒక వెలుగు వెలిగాడు.

Advertisement

నువ్వు నేను సినిమా తో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు.అంతేకాదు ఈ సినిమా ఉదయ్ స్టార్ డమ్ ను అమాంతం పెంచేసింది.ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

దీంతో ఉదయ్ కిరణ్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్‌కు తిరుగుండదని అనుకున్నారు.

స్టార్ హీరో రేంజ్ కు వెళ్లిపోతాడని అనుకున్నారు.కానీ అక్కడే విధి ఉదయ్ కిరణ్ ను చిన్న చూపు చూసింది.

అనూహ్యంగా వరుస ఫ్లాప్ లు ఉదయ కిరణ్ ను కెరీర్ ను ప్రశ్నార్థకం చేశాయి.ఎన్ని సినిమాలు చేసినా తాను కోరుకున్న విజయం దక్కలేదు.

అల్లు అర్జున్ భార్య ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. వామ్మో అంత సంపదించారా?
మోక్షజ్ఞ ప్రశాంత్ మూవీ రద్దు... సంచలనమైన లేఖ విడుదల చేసిన మేకర్స్!

మార్కెట్ కూడా బాగా పడిపోయింది.అవకాశాలు కూడా తగ్గడంతో మనస్థాపానికి గురయ్యాడు ఉదయ్.మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకొని శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు.

Advertisement

సినిమా ఇండస్ట్రీలో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయ్యాడు ఉదయ్ కిరణ్.ఇందుకు తన స్వీయ తప్పిదాలు కూడా ఒక కారణమని తెలుస్తోంది.

కాగా ఉదయ్ కిరణ్ తన కెరీర్‌లో చాలా బ్లాక్ బస్టర్‌లు(Blockbusters) మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి.అందులో దర్శక ధీరుడు రాజమౌళి(Director Rajamouli) సినిమా కూడా ఉందట.

అప్పటికే యూత్ లో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్‌తో రాజమౌళి(Rajamouli ,Uday Kiran) కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడట.ఎన్టీఆర్(NTR) తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తెరకెక్కిస్తోన్న సమయంలోనే స్టోరీ కూడా రాసుకున్నాడట.

అయితే ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేసులో నితిన్ ను తీసుకున్నారట.అదే సై సినిమా.ఈ రెండు సినిమాలు కూడా భారీగా సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే.

ఒకవేళ ఉదయ్ కిరణ్ సై సినిమా కనుక చేసి ఉండి ఉంటే అయినా క్రేజ్ మరో లెవల్ లో ఉండేదని చెప్పాలి.ఉదయ్ కిరణ్ మరణాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

తాజా వార్తలు