కార్తీక మాసంలో ఎలాంటి శివలింగాన్ని పూజిస్తే ఏ విధమైన ఫలితం కలుగుతుందో తెలుసా?

తెలుగువారు ఎక్కువగా కొలిచే దేవ దేవతలలో పరమేశ్వరుడు ఒకరు.పరమేశ్వరుడిని ఎక్కువగా విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో పూజిస్తారు.

ఈ క్రమంలోనే శివలింగానికి పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు.శివుడు అంటే శుభాన్ని ప్రసాదించే వాడు అని అర్థం కనుక ఆయనకు ఎన్నో రూపాలు ఉన్నాయి.

అయితే మనకు తెలిసినంత వరకు శివుని కేవలం నల్లరాతి రూపంలో మాత్రమే మనం పూజిస్తాము కానీ మనకు తెలియని ఎన్నో రకాల శివ లింగాలు ఉన్నాయి.అయితే ఈ శివ లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

గంధ లింగం:

ఈ విధమైనటువంటి శివలింగాన్ని పూజించే సమయంలో నాలుగు భాగాలు గంధం మూడు భాగాలు కుంకుమ కలిపి ఈ లింగాన్ని పూజించాలి.ఇలాంటి లింగాన్ని పూజించడం వల్ల శివసాయుజ్యం లభిస్తుంది.

Advertisement

పుష్ప లింగం:

వివిధ రకాల పుష్పాలతో ఈ శివలింగాన్ని పూజిస్తారు.ఈ శివలింగం పూజించడం వల్ల రాజ్యాధిపత్యం కలుగుతుంది.

నవనీత లింగం

: వెన్నతో చేసిన ఈ శివ లింగాన్ని పూజించడం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

లవణ లింగం:

హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి తయారుచేసిన ఈ శివ లింగాన్ని పూజించడం వల్ల వశీకరణ శక్తి లభిస్తుంది.

భస్మమయలింగం: భస్మంతో తయారు చేసిన ఈ లింగాన్ని పూజించడం వల్ల సిద్ధులను కలుగజేస్తుంది.గోమయ లింగం: కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు.ఈ విధమైనటువంటి లింగాన్ని పూజ చేయడంవల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు.

ఇలా ఒక్కో శివలింగాన్ని పూజించడం వల్ల ఒక్కో విధమైన ఫలితాలు ఉంటాయి.

శొంఠి పొడి రెగ్యుల‌ర్‌గా తింటే..ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
Advertisement

తాజా వార్తలు