మహేష్ బాబు సినిమాకి హీరో సిద్దార్థ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సినిమా ఏమిటో తెలుసా?

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, ఎన్నో కష్టాలను అనుభవించి పైకి ఎదిగిన హీరోలు మన టాలీవుడ్( Tollywood ) లోనే కాదు, సౌత్ లో కూడా చాలా మంది ఉన్నారు.

అలాంటి హీరోలలో ఒకడు సిద్దార్థ్.

ఈయన ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి.సినిమాల్లో హీరో అయ్యేముందు ఈయన లెజండరీ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేసాడు.

ముఖ్యంగా కె.బాలచందర్, మణిరత్నం, శంకర్, రాఘవేంద్ర రావు ఇలా ఒక్కరా ఇద్దరా ఎంతో మంది డైరెక్టర్స్ దగ్గర ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.కొంతమంది డైరెక్టర్స్ సిద్దార్థ్( Siddharth ) ని గౌరవిస్తే, మరికొంత మంది డైరెక్టర్స్ ఆయన్ని చాలా తీవ్రంగా అవమానించారు.

ఆ అవమానాలన్నీ తట్టుకొని తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన శంకర్ సినిమాలోనే హీరోగా నటిస్తూ బాయ్స్ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

Do You Know The Movie In Which Hero Siddharth Worked As An Assistant Director Fo
Advertisement
Do You Know The Movie In Which Hero Siddharth Worked As An Assistant Director Fo

ఈ సినిమా తర్వాత సిద్దార్థ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.హీరో గా ఆయన ఎంత ఉన్నతమైన స్థానం లోకి వెళ్ళాడో మనమంతా చూసాము.కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా, బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఆడియన్స్ కి కూడా సిద్దార్థ్ సుపరిచితుడే.

ఇదంతా పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )హీరో గా నటించిన ఒక సినిమాకి సిద్దార్థ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు అనే విషయం చాలా మందికి తెలియదు.ఆ సినిమా మరేదో కాదు, నాని( nani ).మహేష్ బాబు మరియు ఎస్ జె సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇది.ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ కి అర్థం కాక పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.కానీ ఒక ప్రయోగాత్మక చిత్రం గా మాత్రం పేరు తెచ్చుకుంది.

ఈ సినిమాకి ఎస్ జె సూర్య కి అసిస్టెంట్ డైరెక్టర్ గా సిద్దార్థ్ పని చేసాడట.

Do You Know The Movie In Which Hero Siddharth Worked As An Assistant Director Fo

అప్పటికే సిద్దార్థ్ బాయ్స్ సినిమాతో హీరో గా వెండితెర కి పరిచయం అయిపోయాడు.అయినప్పటికీ కూడా సూర్య ప్రత్యేకమైన రిక్వెస్ట్ కారణం గా సిద్దార్థ్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన చివరి చిత్రం ఇదే.ఆ మరుసటి సంవత్సరం ఆయన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి మహేష్ బాబు కి హీరో గా పోటీ ని ఇచ్చే రేంజ్ కి ఎదిగాడు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు