వన్ సెకండ్.అనే పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు యాంకర్ ఓంకార్ ( Omkar )దే.
ఈయన తనదైన యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.అలాగే తన తమ్ముడిని హీరోగా పెట్టి కొన్ని సినిమాలను కూడా తీశారు.
అలాంటి యాంకర్ ఓంకార్ జీవితంలో కూడా ఒక లవ్ స్టోరీ ఉందట.కానీ ఇది చాలా మందికి తెలియదు.
మరి ఓంకార్ లవ్ చేసిన ఆ అమ్మాయి ఎవరు.ఎందుకు పెళ్లి చేసుకోలేదు.
అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఓంకార్ యాంకరింగ్ లో తనదైన మార్క్ ను చాటుతూ ఎన్నో క్రియేటివిటీ ఆలోచనలతో తన షో చూసేవారికి ఎక్సైట్మెంట్ పెంచుతూ ఉంటారు.
అంతేకాదు ఈయన హోస్ట్ గా చేసే సిక్స్త్ సెన్స్ ( Sixth sence ) షో కి వెళ్లిన వారికి పొరపాటున హార్ట్ ఎటాక్ ఉంటే ఆయన చెప్పే వన్ సెకండ్ లకి హార్ట్ ఎటాక్ వస్తుంది అంటూ కొంతమంది ఫన్నీ కామెంట్లు పెడుతూ ఉంటారు.ఇక టీవీల ముందు కూర్చుని చూసే జనాలకు కూడా ఆయన షో చూస్తే టెన్షన్ మొదలవుతుంది.ఇక అప్పట్లో మాయాద్వీపం వంటి ప్రోగ్రాం తో పిల్లలను, పెద్దలను ఎంతగానో అలరించాడు.
అయితే అలాంటి ఓంకార్ (Omkar) ఇండస్ట్రీలో ఉండే ఒక స్టార్ సింగర్ ని పిచ్చిపిచ్చిగా ప్రేమించారట.కానీ ఆయన దురదృష్టం ఆ సింగర్ ఆయన ప్రేమని అంగీకరించలేదు.
అయితే తన ప్రేమను ఎలా ప్రపోజ్ చేద్దామా అని కలలు కంటూ ఓరోజు తన షోకి ఆ సింగర్ ని పిలిచి ప్రపోజ్ చేద్దామని భావించారట.అనుకున్నదే తడవుగా ఆ సింగర్ ని తన షో కి పిలుచుకొని షో మొత్తం అయిపోయాక లాస్ట్ వెళ్లేటప్పుడు ప్రపోజ్ చేశారట.
కానీ ఆ సింగర్ ( Singer ) తన ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయకుండా చిన్న నవ్వు నవ్వి అందరిలాగే తను కూడా నాకు అభిమాని అన్నట్లుగా చూసి చూడనట్టు వెళ్లిపోయిందట.కానీ ఓంకార్ ఆమెను చాలా గాఢంగా ప్రేమించారట.అయినప్పటికీ ఆ సింగర్ మాత్రం వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది.
ఇక ఈ విషయం తెలిసి ఓంకార్ ఎంతగానో బాధపడ్డారట.
కొన్ని రోజులు ఆ అమ్మాయిని తలుచుకొని ఇండస్ట్రీలో కూడా రాణించలేకపోయారు.
అయితే ఆ తర్వాత తన జీవితంపై దృష్టి మరల్చి మళ్లీ ఇండస్ట్రీలో కంబ్యాక్ ఇచ్చి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో కూడా సెటిల్ అయ్యారు.అయితే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఓంకార్ ప్రేమించిన ఆ సింగర్ ఎవరబ్బా అంటూ చాలామంది నెటిజన్లు ఆరాతీస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy