Baby : బేబీ సినిమా హీరో విరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా ఏంటో తెలుసా ?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ బేబీ( Baby ).జులై 14న విడుదలైన ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది.

అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 3 రోకుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసుకొని లాభాల్లోకి అడుగుపెట్టింది.ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్(Vaishnavi Chaitanya, Anand Devarakonda, Viraj ) వారి పాత్రల్లో జీవించారు అనే ప్రశంసలు వస్తున్నాయి.ఈ సినిమాతోనే వైష్ణవి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆనంద్ దేవరకొండ చరిత్రలోనే ఫస్ట్ టైం 23 కోట్లు క్రాస్ చేసిన మూవీగా ఈ సినిమా రికార్డు నెలకొల్పింది.

Advertisement

ఈ సినిమా మొత్తం ముగ్గురి చుట్టే ఎక్కువ తిరుగుతుంది.బేబీ సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటు విరాజ్ క్యారెక్టర్ చాలా ముఖ్యం.ఈ పాత్రే సినిమాని మార్చేస్తుంది అని చెప్పాలి.

బేబీ సినిమా విడుదలయ్యాక విరాజ్ క్యారెక్టర్ కి ప్రశంసలు వస్తున్నాయి.అయితే బేబీ సినిమాలో నటించిన విరాజ్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.

సైలెంట్ గా, లవర్ బాయ్ లా కనిపించే విరాజ్ అనగనగా ఒక ప్రేమ కథ ( anaganaga oka prema katha )అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు.అంతేకాదు ఆ సినిమాకి దర్శకుడు కూడా విరాజ్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు.

ఆ తరువాత విరాజ్ అనసూయతో కలిసి ఒక సినిమాలో నటించాడు.థాంక్యూ బ్రదర్ అనే సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యింది.

లోకేష్ యూనివర్స్ కి రంగం సిద్ధం చేస్తున్న దర్శకుడు...మామూలుగా ఉండదు...
ఆ స్టార్ డైరెక్టర్ కథను సిద్ధు జొన్నలగడ్డ రిజెక్ట్ చేశారట.. అసలేం జరిగిందంటే?

ఆ తరువాత మనసానమః అనే షార్ట్ ఫిలిం ద్వారా రికార్డులు నెలకొల్పాడు.ఈ షార్ట్ ఫిలిం ఏకంగా 513 అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

Advertisement

అంతేకాదు మొట్టమొదటి షార్ట్ ఫిలిం గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా చోటుచేసుకుంది.బేబీ సినిమాతో మరింత ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు విరాజ్.

బేబీ సినిమాలో అద్భుతంగా నటించాడని, మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేయాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు