జలుబు నుంచి కీళ్ల నొప్పుల వరకు ఆవ నూనెతో ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?

ఆవ నూనె( Mustard oil ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.చాలా మంది వంటల్లో ఆవ‌ నూనెను ఉపయోగిస్తారు.

ఎందుకంటే మిగతా వంట నూనెలతో పోలిస్తే ఆవ నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఆవ నూనెలో లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది.

ఇది క్యాన్సర్( Cancer ) వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది.ఆవ నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు వ్యాప్తికి అది అడ్డుకట్ట వేస్తుంది.

అలాగే పూర్వకాలం జలుబు, దగ్గు ( Cold, cough )వంటి సమస్యలకు ఆవ నూనెతో చెక్ పెట్టేవారు.అందుకోసం వాటర్ లో నాలుగు చుక్కలు ఆవనూనె వేసి ఆవిరి పట్టాలి.

Advertisement
Do You Know How Many Health Problems Can Be Checked With Mustard Oil? Mustard Oi

ఇలా చేస్తే జలుబు, దగ్గు పరార్ అవుతాయి.ఒకవేళ క‌ఫంతో ఇబ్బంది పడుతుంటే ఆవ నూనెలో రెండు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించాలి.

ఇప్పుడు ఈ ఆయిల్ గోరు వెచ్చగా అయిన తర్వాత ఛాతిపై అప్లై చేసుకుని మర్దన చేసుకుంటే కఫం కరుగుతుంది.

Do You Know How Many Health Problems Can Be Checked With Mustard Oil Mustard Oi

ఆవ నూనెలో సెలీనియం ( Selenium )మరియు మెగ్నీషియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.అలాగే ఒమేగా 3 మ‌రియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కు ఆవ నూనె గొప్ప మూలం.

అందువల్ల రోజూవారీ వంట్లో లేదా సలాడ్స్ లో ఆవ నూనెను భాగం చేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.మెదడు చురుగ్గా మారుతుంది.జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.

Do You Know How Many Health Problems Can Be Checked With Mustard Oil Mustard Oi
వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!

పైగా ఆవ నూనె జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.అంతేకాదండోయ్‌.

Advertisement

ఆవ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.ఇవి కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడానికి సహాయపడతాయి.

గోరువెచ్చని ఆవ నూనెను ప్ర‌తి రోజు నొప్పి ఉన్నచోట అప్లై చేసుకుని మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తాజా వార్తలు