వామ్మో దీపికా కట్టిన ఈ చీర ఖరీదు అన్ని లక్షల.. అన్ని వేల గంటలు కష్టపడ్డారా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నటి దీపిక పదుకొనే( Deepika Padukone ) ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

ఈమె తల్లి కాబోతున్నానని శుభవార్తను అభిమానులతో పంచుకున్నప్పటినుంచి ఇప్పటివరకు బయట కనిపించలేదు.

అయితే ఒక్కసారిగా ఈమె కల్కి సినిమా( Kalki Movie ) ప్రమోషన్ల కోసం బయటకు రావడంతో ఈమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.బేబీ బంప్( Deepika Padukone Baby Bump ) తో దీపికా కనిపించడంతో ఈమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా దీపిక ఆనంత్ అంబానీ రాధిక మర్చంట్ సంగీత వేడుకలు కూడా సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో చీరలో మెరిసిన దీపిక చీరలో బేబీ బంప్ తో ఉన్నటువంటి ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈమె ధరించిన చీర ( Deepika Padukone Saree ) గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.పర్పుల్ కలర్ ఫుల్ ఎంబ్రాయిడ్ శారీలో దీపిక ఎంతో అందంగా కనిపించారు.

Advertisement

అయితే ఈ చీర ఖరీదు ఎంత ఏంటి అనే విషయాల గురించి నేటిజన్స్ ఆరా తీయాగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

చీర ఖరీదు ఏకంగా 1,92,000 అని తెలిసి షాక్ అయ్యారు.అంతేకాకుండా ఈ చీర పై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం చేతితో వేసినదని తెలుస్తుంది.ఇలా ఈ చీర తయారు చేయడానికి ఏకంగా 3 వేల 400 గంటల సమయం పట్టిందనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.

ఇలా ఈ చీర ఇంత ఖరీదు చేయడానికి ఈ చీరలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే విషయానికి వస్తే.ఈ చీర లేబుల్ టోరానీ షెల్ఫ్‌ల నుండి డిజైన్ చేయబడింది.

ఈ చీర యొక్క ఫాబ్రిక్ ఆర్గాన్జా మరియు జెన్నీ సిల్క్ చే తయారు చేయబడింది.ఈ అరుదైన అందమైన చీరలో ముత్యాలు, జరీ మరియు తీగల అలంకరణలు చీరకు రెట్టింపు అందాన్ని తీసుకురావడంతో ఈ చీర ఖరీదు భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు