Butterflies Drink Tears: సీతాకోక చిలుకలు కన్నీళ్లు తాగుతాయని మీలో ఎంత మందికి తెలుసు?

సీతాకోక చిలుకలు కన్నీళ్లు తాగడమేంటని మీ ముఖం కాకపోతే అని అడుగుతారా? కానీ మీరు విన్నది నిజమేనండి.

ఒక్క సీతాకోక చిలుక మాత్రమే కాదు, తేనెను పీల్చే తేనెటీగలు కూడా ఇలానే కన్నీళ్లు తగ్గుతాయి.

అంతేకాకుండా తాబేలు, మొసలి వివిధ కూడా మిగతా జీవుల కన్నీళ్లను తాగుతాయట.బేసిగ్గా సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని స్వీకరిస్తాయి అని తెలిసినదే.

అలాగే అమెజాన్ అడవుల్లోని ఉన్న సీతాకోక చిలుకలు మకరందాన్ని తినవు.ఆ అడవిలోని సీతాకోక చిలుకలు కన్నీళ్లను ఆహారంగా తాగతాయట.

అవును, దానికి ఓ ఋజువు వుంది.ఓసారి అమెజాన్ అడవుల్లో ఒక శాస్త్రవేత్త పర్యటిస్తుండగా.

Advertisement

అతను కొన్ని సీతాకోక చిలుకలను పరిశీలించాడు.అలా పరిశీలించగా పరిశీలించగా అతనికి ఓ విషయం బోధ పడింది.

తాబేళ్ల కళ్ల నుంచి అవి కన్నీళ్లను పీల్చడం తెలుసుకున్నాడట.ఇలా ఎందుకు పీలుస్తున్నాయని.

అనుమానంతో కొన్ని రోజుల అక్కడే వుంది మరీ పరిశోధన చేశాడట.ఎప్పుడూ మకరందాన్ని తాగే వీటికి లవణాలు అవసరం.

ఉప్పులో ఉండే పోషక పదార్థాలతో ఇవి గుడ్లు పెట్టి.వాటి జీవిత చక్రాన్ని సాఫీగా చేయగలవు.

ఉదయం వీటిని తీసుకుంటే గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుందట.. తెలుసా?

ఇప్పుడర్ధం అయ్యిందా అసలు విషయం.కన్నీళ్లు ఉప్పగా ఉంటాయనే సంగతి మీకు తెలుసు కదా.తెలియకపోతే మన కన్నీళ్లను ఒకసారి నాలుకపై వేసి చూడండి అర్ధం అవుతుంది.అందుకే అవి జంతువుల కన్నీళ్లు మాత్రమే కాకుండా వాటి మూత్రం, చెమట ఎక్కడ లవణాలుంటే అక్కడ ఈ మకరంద జీవులు వాలి, ఆరగిస్తాయట.

Advertisement

ఇక కేవలం సీతాకోక చిలుకలు మాత్రమే కాకుండా తేనెటీగలు కూడా ఇలానే చేస్తాయట.ఒకవేళ మీరు పరీక్షించి దలిస్తే మీ చుట్టుపక్కల సీతాకోక చిలుకలను ఒకసారి గమనించండి చూడండి, మీకే అర్ధం అయిపోతుంది.