మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

మీరు ఈ మధ్యకాలంలో కొత్త ఇంటికి మారాలనుకుంటున్నారా అయితే వాస్తు నిపుణులను( Vastu experts ) సంప్రదించారా.

వాస్తు దోషాలను తొలగించడానికి ఉన్న చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటిలోని వాస్తు దోషాలు ఒక వ్యక్తి ఆర్థిక బాధలు, మానసిక ఒత్తిడి, వాదనలతో సహా అనేక సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు.కాబట్టి ఇల్లు ఎల్లప్పుడూ వాస్తు దోషం లేకుండా ఉండాలి.

ఇంట్లో సానుకూల శక్తి ఉండాలని ఎల్లప్పుడూ పండితులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.పండితుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో మురికి అసలు ఉండకూడదు.

అందువల్ల ఇంటి శుభ్రత పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

Do You Have Vastu Doshas In Your House But Follow These Tips , Vastu Doshas, Vas
Advertisement
Do You Have Vastu Doshas In Your House But Follow These Tips , Vastu Doshas, Vas

లక్ష్మీదేవి( Goddess Lakshmi ) ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో నివసిస్తుందని పండితులు చెబుతున్నారు.ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి.జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఇంట్లో మొక్కలు నాటడం వల్ల వాస్తు దోషాల( Vastu Doshas ) ప్రభావం కూడా తగ్గుతుంది.

వాస్తు శాస్త్రంలో ఇటువంటి అనేక పవిత్రమైన మొక్కల గురించి ఉంది.వీటిని నాటడం వల్ల ఇంట్లో ప్రతికూలత దూరమైపోతుంది.అందువల్ల మీ ఇంట్లో తులసి, వేప, మనీ ప్లాంట్లను నాటాలి.

ఇలా చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుందని పండితులు చెబుతారు.

Do You Have Vastu Doshas In Your House But Follow These Tips , Vastu Doshas, Vas

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఊయల పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావాలు దూరమైపోతాయి.అలాగే ఇంట్లో ఊయల ఉండటం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి ఇంటికి శ్రేయస్సు వస్తుంది.అయితే ఇంటి ఉత్తర భాగంలో ఊయల ఉండడం మంచిదని పండితులు చెబుతున్నారు.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

అంతే కాకుండా ఇంట్లో పూజ చేసేటప్పుడు గంటను మోగించడం చాలా శుభప్రదంగా ప్రజలు భావిస్తారు.పూజ సమయంలో గంటను మోగించడం వల్ల ఇంట్లో వాస్తు దోషాల ప్రభావాలు తగ్గి సానుకూలత పెరుగుతుందని ప్రజలు నమ్ముతారు.

Advertisement

హిందూ ధర్మంలో శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు.శంఖం ఉన్న ఇళ్లలో వాస్తు దోషాలు ఉండవని ప్రజలు నమ్ముతారు.కాబట్టి, పూజ సమయంలో రోజూ శంఖాన్ని ఊదాలి.

ప్రతి రోజు శంఖాన్ని ఊదడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత దూరమైపోతుంది.ఇది ఒత్తిడి, ఇంటి సమస్యల నుంచి ఉపశమనన్ని కలిగిస్తుంది.

తాజా వార్తలు