మనకంటూ నాయకుడు లేడా?.. ఏపీలో రగిలిపోతున్న కాపులు!

ఏపీలో కాపు సామాజిక వర్గం తీవ్ర ఆసంతృప్తితో ఉంది.తమకు సరైన నాయకత్వం లేదని భావిస్తుంది ,తమ అభ్యున్నతికి  సంక్షేమానికి పెద్ద అడ్డంకిగా అనుకుంటుంది.

 సామాజిక వర్గానికి ప్రత్యేక కోటా కల్పించాలని కోరుతూ రాజకీయ కురువృద్ధుడు హరి రామ జోగయ్య చేపట్టిన దీక్ష తర్వాత ఈ అంశం మరోసారి దృష్టిని ఆకర్షించింది. 80 ఏళ్లు పైబడిన ఈ అనుభవజ్ఞుడు కాపుల కోసం పోరాడుతున్నాడు,  కానీ ఆయనకు కాపు సామాజిక వర్గం నుండి తగినంత మద్దతు లభించలేదు.మరోవైపు ముద్రగడ  జగన్‌ను పూర్తిగా దాసోహమయ్యారు, కాపులకు కోసం పోరాడటానికి బలమైన నాయకత్వం అవసరమని పలువురు నేతలు భావిస్తున్నారు.

సమర్ధవంతమైన నాయకుడు లేకపోవడం వల్ల ఆ సంఘంలోని ప్రముఖ నాయకులు వివిధ రాజకీయ పార్టీలో ఎలాగలాగో సర్దుకుపోతున్నారు. జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ, అవసరమైన నిధుల వనరులు ఉన్నప్పటికీ, కాపులలో ఐక్యత లేకపోవడం, రాజకీయాలలో వారి వైఫల్యానికి ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి.

జన సేనాని పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో ఆ సామాజికవర్గానికి నాయకుడిగా చెప్పుకోకుండా దూరంగా ఉన్నారు. తాను నిజమైన నాయకుడైతే అన్ని వర్గాలు, కులాల ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని పదే పదే వివరిస్తున్నారు.

కాపుల కోసం ఎన్నోసార్లు వాదించినా తన నాయకత్వంలో సంఘటితం కావాలని ఎప్పుడూ పిలుపునివ్వలేదు. ఇదిలా ఉంటే వైసీపీలోని కాపు నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు రాజకీయ చిత్తశుద్ధి, అంకితభావం లోపించి పవన్‌ కల్యాణ్‌పై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement
Do We Not Have A Leader Of Our Own , Rajya Sabha Member G.V.L. Narasimha Rao, Ka

కాపు ఓట్ల చీలిక కారణంగానే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.

Do We Not Have A Leader Of Our Own , Rajya Sabha Member G.v.l. Narasimha Rao, Ka

నెల రోజుల క్రితం ముగ్గురు కాపు నేతలు – టీడీపీకి చెందిన బోండా ఉమా, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  భోజన సమయంలో సమావేశమై కాపుల రాజకీయ గుర్తింపు కోసం కార్యాచరణ ప్రణాళికపై చర్చించినట్లు సమాచారం. అయితే, క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఫలితం గురించి ఎటువంటి నివేదికలు లేవు.

Advertisement

తాజా వార్తలు