ఎన్నో రాజకీయ సమీకరణాలను లెక్కల్లోకి తీసుకుని జగన్ మొదటి, రెండో విడత మంత్రివర్గ విస్తరణ చేపట్టారు .
మొదటి, రెండో విడతల్లోనూ ఎవరు ఊహించిన వారికి జగన్ మంత్రి పదవులు కట్టబెట్టారు.
ఎక్కడా ఎటువంటి విమర్శలు రాకుండా, సామాజిక వర్గాల ప్రాధాన్యాన్ని లెక్కల్లోకి తీసుకుని మరి జగన్ తన మంత్రి వర్గాన్ని కూర్పు చేశారు.మొదటి విడత మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న వారిలో కాస్త గొంతు నాయకులు ఉన్నారు.
దీంతో జగన్ పైన, ప్రభుత్వం పైన ఎవరు విమర్శలు చేసిన తీవ్ర పదజాలంతో విరుచుకు పడేవారు.కానీ వారందరినీ జగన్ తప్పించారు.
రెండో విడతలో చాలామంది కొత్తవారికి అవకాశం కల్పించారు.పేరుకే మంత్రులు తప్ప ప్రభుత్వంపైనా, ప్రతిపక్షాలపైనా విమర్శలు చేస్తున్న , జగన్ పైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నా, ప్రస్తుత మంత్రులు సైలెంట్ గానే ఉండిపోతున్నారు.
ఈ వ్యవహారాలు జగన్ కు ఏమాత్రం నచ్చడం లేదు.మంత్రుల స్థాయిలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం, వారు చేసే విమర్శలను తిప్పుకొట్టడం వంటి వ్యవహారాలు చేయాల్సి ఉన్నా, ఎవరికి వారు తమకు ఎందుకులే అన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోవడంతో జగన్ కు ఈ వ్యవహారం ఆగ్రహం కలిగిస్తోంది.
ఇప్పటికే జగన్ మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు .ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు, ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పుకొట్టాలని సూచించారు.ప్రస్తుతం జగన్ పైన, లిక్కర్ స్కాం లో ఉన్నారంటూ జగన్ భార్య భారతి రెడ్డి పైన టిడిపి విమర్శలు చేస్తున్నా, మంత్రులు సైలెంట్ గా ఉండడం పై అసంతృప్తి చెందిన జగన్ ముగ్గురు మంత్రులకు పదవి గండం ఉన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు.
దీంతో ఎవరు ఆ ముగ్గురు అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
ఈ ముగ్గురిలో ఒకరు మహిళ మంత్రి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.తాను హెచ్చరికలు చేసిన తర్వాత కూడా మంత్రులు స్పందించడం లేదని, టిడిపి, జగన్ పై విమర్శలు చేస్తున్న ఎవరూ స్పందించకపోవడం , భారతి పై వచ్చిన విమర్శలను మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రమే ఖండించారు.మిగతా మంత్రులు టిడిపి పై విమర్శలు చేసేందుకు వెనకడుగు వేస్తూ ఉండడంతో , పనితీరు బాగాలేని ముగ్గురు మంత్రులను తప్పించి మిగతా వారికి హెచ్చరికలు పంపాలని జగన్ నిర్ణయించుకున్నారట.
ఈ మేరకు నవంబర్ లో మంత్రి వర్గంలో మార్పు చేర్పులు చేపట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారట. .
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy