శని దోషాలు తొలగిపోవాలంటే ప్రతిరోజూ నువ్వులతో ఇలా చేస్తే..?

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎన్నో ఈతిబాధలు ,శని దోషాలు.ఈ క్రమంలోనే కొందరు శని దేవుడి పేరు వినగానే ఎంత భయబ్రాంతులకు లోనవుతారు.

అందరి దృష్టిలో శని అంటే ఎన్నో ఇబ్బందులకు గురి చేసే వాడని, ఒక్కసారి శని ఆవహిస్తే దాదాపు ఏడు సంవత్సరాలపాటు తొలగిపోదని అందరూ భావిస్తుంటారు.నిజానికి శనీశ్వరుడు న్యాయాధికారిగా అనవసరంగా ఎవరిపై తన ప్రభావం చూపడు.

ఎవరికైనా తాను చేసిన తప్పుల వల్ల కర్మ ఫలితాలను అనుభవింప చేస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.మన పై ఏర్పడిన శని ప్రభావం తొలిగిపోవాలంటే తప్పకుండా శనీశ్వరుని పూజించాలి.

శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన పనులు చేయడం వల్ల శని ప్రభావం నుంచి తొందరగా బయటపడవచ్చు.శనీశ్వరుని అనుగ్రహం మనపై కలిగితే పూర్తిస్థాయిలో మన నుంచి శని ప్రభావం తొలగిపోతుంది.

Advertisement
Do This Everyday To Get Rid Of Saturn Bugs, Saturn Bugs, Every Day, Shiva Temple

ఈ క్రమంలోనే శని దేవునికి ఎంతో ప్రీతికరమైన వాటిలో శివలింగం పూజ ఒకటి.సాధారణంగా శని దేవుడిని ఈశ్వరుని అంశంగా భావించి శనీశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.

కావున శనికి ఎంతో ఇష్టమైన శివలింగం అభిషేకం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.శని ప్రభావంతో బాధపడే వారు నిత్యం శివలింగానికి అభిషేకం నిర్వహించటం పూర్తిగా శని ప్రభావం నుంచి బయటపడవచ్చు.

Do This Everyday To Get Rid Of Saturn Bugs, Saturn Bugs, Every Day, Shiva Temple

అదేవిధంగా శనీశ్వరునికి ఎంతో ఇష్టమైన శనివారం రోజు శివాలయంలో ప్రసాదాలు పంచటం, ప్రతిరోజు నల్లని నువ్వులు కలిపి అన్నం కాకులకు పెట్టడం వల్ల శని ప్రభావం నుంచి విముక్తి పొందవచ్చును.అదేవిధంగా శనివారం హనుమంతుడిని, శ్రీవారికి దర్శించడం, సుందరకాండ చదవడం వంటి వాటి ద్వారా శని ప్రభావం నుంచి తొందరగా బయటపడవచ్చు.శనివారం శనీశ్వరునికి పూజలు నిర్వహించేటప్పుడు నల్లని దుస్తులను ధరించి, శనీశ్వరునికి నీలం రంగు పుష్పాలతో పూజ చేయటం వల్ల శనీశ్వరుడి ఎంతో ప్రీతి చెందుతాడని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు