నైట్ నిద్రించే ముందు అవిసె గింజలతో ఇలా చేస్తే జుట్టు రాలమన్నా రాలదు!

అవిసె గింజలు( Flax seeds ).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

ఇవి ఆరోగ్యానికి అందించే ప్రయోజనాల గురించి వివరించాల్సిన పనిలేదు.ఎన్నో విలువైన పోషకాలు కలిగి ఉండే అవిసె గింజలు వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో విధాలుగా సహాయపడుతుంది.

అలాగే జుట్టు సంరక్షణకు కూడా అవిసె గింజ‌లు ఉపయోగపడతాయి.ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య( Hair fall problem )ను నివారించడానికి అవిసె గింజలు అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.

అందుకోసం అవిసె గింజలను ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

Advertisement
Do This With Flax Seeds Before Sleeping To Reduce Hair Fall, Flaxseeds, Flaxseed

వాటర్ కాస్త హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజ‌లు వేసి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో అవిసె గింజల జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్ చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.

Do This With Flax Seeds Before Sleeping To Reduce Hair Fall, Flaxseeds, Flaxseed

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్‌ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఈ ఓవర్ నైట్ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల అవిసె గింజలు మరియు ఆముదం లో ఉండే పలు పోషకాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి.

జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.

Do This With Flax Seeds Before Sleeping To Reduce Hair Fall, Flaxseeds, Flaxseed
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అలాగే ఈ హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల డ్రై హెయిర్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.జుట్టు సూపర్ సిల్కీగా మారుతుంది.చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.

Advertisement

కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్ సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో వారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు