మీరు వాడుతున్న యాప్‌లో యాడ్స్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

మారుతున్న దైనందిత జీవితంలో అందరికీ స్మార్ట్‌ఫోన్‌ అవసరం ఏర్పడింది.దాంతో వివిధ రకాల యాప్స్ వినియోగం పెరిగింది.

అయితే ఇలాంటి యాప్స్ మనం వాడేటప్పుడు కొన్ని రకాల యాడ్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి.అందులో ఒక యాప్ గూగుల్ మెసేజెస్ యాప్.

ఇది బేసిగ్గా మొబైల్ కొన్నతరువాత బై డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది.దాంతో కొంతమంది దీన్ని వాడుతూ వుంటారు? అయితే ఇందులో పదేపదే యాడ్స్ కనిపించడం ఒకరకంగా అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది.చాలావరకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ మెసేజెస్ యాప్ ప్రీలోడెడ్‌గా వస్తుంది.

ఈ నేపథ్యంలో ఇండియా విషయానికి వచ్చేసరికి భారతీయ మార్కెట్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ పనితీరుపై కొన్ని విమర్శలు వచ్చాయి.వెరిఫై చేసిన వ్యాపార ఖాతాల నుంచి యూజర్లకు స్పామ్ సందేశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

Advertisement

వస్తున్న ప్రకటనల్లో ఎక్కువగా బ్యాంకులు లేదా ఫైనాన్సింగ్ సంస్థల నుంచి ప్రీ-అప్రూవ్డ్ లోన్స్‌కు సంబంధించినవే ఉండటం గమనార్హం.RCS (రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్) మెసేజింగ్ సర్వీస్ ద్వారా యూజర్లు ఎమోజీస్, పిక్చర్స్, మల్టీమీడియా ఫైల్స్ కలిసి ఎస్ఎంఎస్‌ను ఆకట్టుకునేలా పంపడానికి వీలుంటుంది.

కానీ ఇందులో యాడ్స్ ఎక్కువగా కనిపిస్తుండటంతో యూజర్లు కాస్త అసహనానికి గురవుతున్నారు.సాధారణంగా ఇలాంటి ప్రకటనలతో ఎలాంటి ప్రమాదం ఉండదు.కానీ అందులో ఉండే లిక్స్ క్లిక్ చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి కాబట్టి కాస్త ఇబ్బందికరంగానే చెప్పుకోవాలి.

అందుకే గూగుల్ మెసేజెస్ యాప్‌లో యాడ్స్ రాకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మీరు మార్చుకోవలసి ఉంటుంది.ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు ఆ యాడ్స్ కి చెక్ పెట్టవచ్చు.

1.ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ ఓపెన్ చేయండి.2.ఆ తర్వాత అకౌంట్ బబుల్ పైన క్లిక్ చేసిన తరువాత మెసేజ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి.3.ఆ తర్వాత ఛాట్ ఫీచర్స్ పైన క్లిక్ చేయండి.4.తర్వాత జాగ్రత్త్తగా ఛాట్ ఫీచర్స్ ఆప్షన్ డిసేబుల్ చేస్తే సరిపోతుంది.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వైఫై లేదా మొబైల్ డేటా ఆన్ చేసినా కూడా మీకు యాడ్స్ అనేవి రావు.

Advertisement

తాజా వార్తలు