పల్చటి జుట్టు రెండు నెలల్లో ఒత్తుగా మారాలంటే ఇలా చేయండి!

సాధారణంగా కొందరి జుట్టు చాలా అంటే చాలా పల్చగా ఉంటుంది.

పల్చటి జుట్టు కలిగి ఉన్నవారు ఎటువంటి హెయిర్ స్టైల్స్ ( Hair styles )వేసుకున్న సెట్ అవ్వవు.

పైగా పల్చటి జుట్టు వల్ల అట్రాక్టివ్ గా కూడా కనిపించలేరు.ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ అద్భుతంగా తోడ్పడుతుంది.ఈ ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే రెండు నెలల్లో మీ పల్చటి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మారుతుంది.

ఆయిల్ తయారీ కోసం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఐదు రెబ్బలు వేపాకు,( Five leaves of neem ) ఐదు రెబ్బలు కరివేపాకు, గుప్పెడు మెంతాకు, రెండు గింజ తొలగించి సన్నగా తరిగిన ఉసిరికాయలు( amla ) వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె ( coconut oil )వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి చిన్న మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఆయిల్ పూర్తిగా చల్లారిన అనంతరం బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను ఉపయోగించాలి.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ ను పట్టించి మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్ అప్లై చేసుకున్న నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

ఈ ఆయిల్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.పల్చటి కురులను ఒత్తుగా మారుస్తుంది.అలాగే ఈ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు రాలడం, విరగడం తగ్గుతాయి.

Advertisement

జుట్టు దృఢంగా మారుతుంది.అంతేకాకుండా చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఈ ఆయిల్ బెస్ట్ సొల్యూషన్ అవుతుంది.

ఈ ఆయిల్ చుండ్రును పూర్తిగా తొలగించి స్కాల్ప్ ను ఆరోగ్యంగా మారుస్తుంది.

తాజా వార్తలు