పెళుసుగా మారిన ఎముకలు నెల రోజుల్లో దృఢంగా మారాలంటే ఇలా చేయండి!

ఎముకలు ఎంత బలంగా ఆరోగ్యంగా ఉంటే అంత బాగుంటారు.ఎముకలు పెళుసుగా మారాయి అంటే సమస్యలన్నీ మొదలవుతాయి.

కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, చిన్న చిన్న దెబ్బలకు ఎముకలు విర‌గ‌డం, చిట్లడం తదితర సమస్యలన్నీ తలెత్తుతూ ఉంటాయి.అందుకే ఎముకల ఆరోగ్యం పట్ల ఏ మాత్రం అజాగ్రత్త వహించరాదు.

అయితే పెళుసుగా మారిన ఎముకలు నెల రోజుల్లో దృఢంగా మారాలంటే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను తప్పకుండా డైట్ లో చేర్చుకోండి.ఇంకెందుకు లేటు ఎముకలను దృఢపరిచే ఆ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ లో తీసుకుని అందులో గింజ తొలగించిన ఎండు ఖర్జూరం ఒకటి, డ్రై అంజీర్ ఒకటి వేసుకుని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.అలాగే మరో గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక కప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement

మ‌రుస‌టి రోజు ఉదయాన్నే ఒక యాపిల్ ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, నైట్ అంతా నానబెట్టుకున్న ఎండు ఖర్జూరం, అంజీర్‌ మరియు నువ్వులు వేసుకోవాలి.అలాగే చివరిగా ఒక గ్లాస్బాదం పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి సేవించాలి.ప్రతిరోజు ఈ జ్యూస్ ను తీసుకుంటే కనుక పెళుసుగా మారిన ఎముకలు దృఢంగా మరియు బలంగా మార‌తాయి.

కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి.కాబట్టి తప్పకుండా ఎముకల బలహీనత తో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు