Body parts smell : ఈ శరీర భాగాల నుండి దుర్వాసన వస్తుందా..? అయితే ప్రమాదమే..!

శారీరక శ్రమ తర్వాత వచ్చే చెమటతో శరీరంలో ఒక రకమైన చెమట వాసన( smell of sweat ) రావడం సాధారణమైన విషయం.

కానీ అది మామూలు చెమట వాసన అయితే పర్వాలేదు.

కానీ వాసనలో తేడా గమనిస్తే మాత్రం అది మరింకేదైనా ప్రమాదకర ఆరోగ్య సమస్యల వలన కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.అయితే అదే విధంగా బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి నుండి దుర్వాసన రావడం జరిగితే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయకూడదు.

తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి.ఎంతో శుభ్రం చేసిన నోటి నుండి దుర్వాసన దూరం కావడం లేదంటే మాత్రం ఆరోగ్యంలో ఇంకా ఏదో తేడా ఉందని అనుమానించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నోటి దుర్వాసన( Bad breath ) వీడనప్పుడు ఆసిడ్ రిఫ్లెక్స్, క్రానిక్స్ సైనస్ ఇన్ఫెక్షన్, నోటిలో తగినంత లాలాజలం రాకపోవడం, లేదా కొన్ని రకాల మందులు వాడడం వలన కూడా కావచ్చు.అలాగే చాలా అరుదుగా నోటి దుర్వాసన నోటి క్యాన్సర్ వల్ల కూడా కావచ్చని డెంటిస్టులు చెబుతున్నారు.

Advertisement

ఇక జననేంద్రియాల నుండి దుర్వాసన రావడం కూడా అస్సలు మంచిది కాదు.జననేంద్రియాలు నుంచి సువాసన రాకపోయినా చేపల నుండి వచ్చే నీచు వాసన వస్తే మాత్రం అది కొంచెం ఆలోచించాల్సిన విషయం.

స్త్రీ జననేంద్రియాలలో ఇలా నీచువాసన వస్తుంటే కచ్చితంగా గైనకాలజిస్ట్లను సంప్రదించాలి.

అలాగే వాసనతో పాటు యోని స్రావాలు నీటిలా పలుచగా, బూడిద రంగుతో ఉండడం బ్యాక్టీరియాసిన్( bacteriocin ) అనే ఇన్ఫెక్షన్ కు కూడా సంకేతం కావచ్చు.దీనికి తప్పకుండా యాంటీబయోటిక్ చికిత్స చాలా అవసరం ఉంటుంది.ఈ సమస్యలో దురద కాని మంట కానీ ఉండవు.

సాధారణంగా మూత్రం కచ్చితంగా ప్రత్యేకమైన దుర్వాసన కలిగి ఉంటుంది.కానీ సాధారణంగా వచ్చే వాసన కాకుండా మరింత ఎక్కువగా దుర్వాసన వస్తుంటే మాత్రం అది స్త్రీ, పురుషులు ఇద్దరికీ కూడా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

అయితే మూత్ర నాళ ఇన్ఫెక్షన్ లో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

Advertisement

మూత్ర విసర్జనలో మంట, నొప్పి, తరచుగా మూత్ర విసర్జన చేయాల్సిన అవసరం ఏర్పడడం, మూత్ర విసర్జన ప్రతిసారి అత్యవసరంగా మారడం, మూత్రం తెల్లగా, చిక్కగా ఉన్నట్లు ఉండడం, ఒక్కోసారి మూత్రంలో రక్తం రావడం, పొత్తి కడుపులో నొప్పి, నడుము కింద భాగంలో నొప్పి, పక్కటేముకల్లో నొప్పి, ఒక్కోసారి చలితో కూడిన జ్వరం ఉండడం ఈ లక్షణాలన్నీ మూత్రనాళ ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు.శరీరంలో ఎక్కడైనా గాయాలు అయితే ఆ గాయం మానెందుకు కొంత సమయం తీసుకుంటుంది.అయితే ఆ గాయం నుండి దుర్వాసన వస్తుంది అంటే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

తాజా వార్తలు