పొత్తులపై బీజేపీలో సోము వీర్రాజు మాటలకు విలువ ఉందా?

ఏపీ బీజేపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది.ఆ పార్టీలో చాలా మంది నేతలు ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు.

కేంద్రంలో మోదీ సర్కారు ఉంది కాబట్టి పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో కొనసాగుతున్నారు.కానీ ఒకరితో ఒకరికి సన్నిహిత సంబంధాలు లేకపోవడం ఆ పార్టీ బలాన్ని దెబ్బతీస్తోంది.

త్వరలో ఎన్నికలు వస్తుండటంతో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన బడా నాయకులంతా ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.తాజాగా గుంటూరు జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది.

ఆ జిల్లాలో బలమైన నేత దళిత నాయకుడు రావెల కిషోర్ బాబు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దు అంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పదే పదే ప్రకటనలు చేస్తుండటంతో పలువురు నేతలు అభద్రతాభావానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి కూడా సోము వీర్రాజు బడాయి మాటలు చెప్తుండటం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.మరోవైపు టీడీపీతో స్నేహం వద్దని కమలం పార్టీ భావిస్తే బీజేపీతో పొత్తు తెంచుకునేందుకు జనసేన పార్టీ సిద్ధం అవుతోంది.

చంద్రబాబుతో పొత్తు అన్నది రాజకీయ వ్యూహంగా చూడాలి తప్ప పాత విషయాలు తవ్వుకోడం తగదని పలువురు బీజేపీ హితబోధ చేస్తున్నారు.మోదీ, అమిత్ షాలను చంద్రబాబు గతంలో ఏదో అన్నారని పొత్తు వద్దు అనుకుంటే ఇంతకంటే ఘోరంగా శివసేన నాయకులు మహారాష్ట్రలో బీజేపీని విమర్శించారని.

అయినా ఆ పార్టీని బీజేపీ అక్కున చేర్చుకుందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

బీజేపీలో ఒక్క సోము వీర్రాజు తప్ప మిగతా వారు టీడీపీతో పొత్తుపై పాజిటివ్ ధోరణిలోనే ఆలోచిస్తున్నారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు.సోము వీర్రాజు మాటలకు విలువ లేదని వాళ్లు భావిస్తున్నారు.సోము వీర్రాజు ఇదే ధోరణిలో ఉంటే రావెల బాటలో మరికొందరు నేతలు నడిచే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ఏ రకంగా చూసినా ఏపీలో ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ టీడీపీతో కలసివెళ్లడమే ఉత్తమమని పలువురు సూచిస్తున్నారు.కాదూ కూడదని కూర్చుంటే మాత్రం పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు