పొరపాటున కూడా మీ చేతులతో ఇతరులకు ఈ వస్తువులను అందివ్వకూడదు..!

సాంప్రదాయాలలో పూర్వం నుండి ఒక భాగంగా కొన్ని పద్ధతులను, ఆచార వ్యవహారాలను మనం నమ్ముతూ వస్తున్నాము.

పశుపక్ష్యాదులకు పూజలు చేయడం, కొన్ని ఆహార పదార్థాలను పవిత్రంగా చూడటం, మొక్కలను పూజించడం లాంటివి మన పూర్వీకుల నుండి మనం నేర్చుకుంటూ వస్తున్నాం.

వీటి వలన మనకు ధన లాభం ఎంత కలుగుతుందో తెలియదు కానీ, మనసుకు మాత్రం ప్రశాంతత అందుతుందని పురాణాలు చెబుతున్నాయి.ఇక సాధారణంగా ఇరుగుపొరుగువారు అన్న తర్వాత కొన్ని వస్తువులను చాలామంది ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు.

కానీ నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను స్వయంగా మన చేతులతో ఇతరుల చేతికి అస్సలు అందింపకూడదని పెద్దలు చెబుతుంటారు.

Do Not Give These Things To Others With Your Hands Even By Mistake , Goddess Lak

ఆ వస్తువులు ఏంటో, వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ఉప్పుకు మన సాంప్రదాయాలలో ప్రత్యేక స్థానం ఉందని మనందరికీ తెలిసిందే.ఉప్పు( salt ) రుచికి కాక, పూజ కార్యక్రమాలలోనూ, దిష్టి తీయడానికి కూడా వాడుతూ ఉంటారు.

Advertisement
Do Not Give These Things To Others With Your Hands Even By Mistake , Goddess Lak

అలాంటి ఉప్పును ఒకరి నుంచి మరొకరు స్వయంగా చేతికి అస్సలు ఇవ్వకూడదని పెద్దలు చెబుతున్నారు.దీని వలన వారి మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉంది.ఉప్పు ఇచ్చిన వారు ఇంట్లో ఆర్థిక నష్టాలు చవి చూస్తారని చెబుతున్నారు.

ముఖ్యంగా ఉప్పును అరచేతిలో అస్సలు వేయకూడదు.దానితో మన అరచేతిలో ఉన్న లక్ష్మీదేవి( Goddess Lakshmi ) నిలవకుండా ఇతరుల పాలవుతుందని చెబుతున్నారు.

Do Not Give These Things To Others With Your Hands Even By Mistake , Goddess Lak

హిందూ సాంప్రదాయాలలో చీపురు( broom ) కూడా ప్రత్యేక స్థానం ఉంది.అలాంటి చీపురునీ ఒకరి చేతి నుంచి మరొకరు అస్సలు ఇవ్వకూడదు.దీని వలన వారిద్దరు ఎంత స్నేహంగా ఉన్నా శత్రువులగా మారిపోతారు.

మరి ముఖ్యంగా ఆడబిడ్డలు తమ పుట్టింటి నుంచి చీపురు అసలు తీసుకోరాకూడదు.దీని వలన వారి పుట్టింటికి వారికి మధ్య తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాల‌నుకుంటున్నారా? అయితే ఈ ఫుడ్స్ మీకే!

ఇక చింతపండును( Tamarind ) కూడా లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు.అందుకే మన ఇళ్లలో ఎప్పటికీ కూడా చింతపండును నిల్వ ఉంచుకోవాలని చెబుతూ ఉంటారు.

Advertisement

అలాంటి చింతపండును ఒకరి చేతితో ఇంకొకరికి అస్సలు ఇవ్వకూడదు.దీని వలన ఇంట్లో శాంతి, ఆర్థిక తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

తాజా వార్తలు