ధన త్రయోదశి రోజు ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తెచ్చుకోకండి?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం కృష్ణపక్ష త్రయోదశి రోజున ధన త్రయోదశిని జరుపుకుంటాము.ఈ ఏడాది ధనత్రయోదశి నవంబర్ 2వ తేదీ వచ్చింది.

ఈ క్రమంలోనే ధన త్రయోదశి రోజు లక్ష్మిదేవి పుట్టినరోజు అని భావించి ప్రత్యేకంగా లక్ష్మీదేవికి కుబేరుడికి పూజలు నిర్వహిస్తారు.ఇలా లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి సంపదను కలిగిస్తుందని భావిస్తారు.

ఈ క్రమంలోనే ధన త్రయోదశి రోజు పెద్ద ఎత్తున బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు.ఇలా బంగారు నగలను కొనుగోలు చేయడం వల్ల మనకు సంపద కలుగుతుందని భావించి ధన త్రయోదశి రోజు నగలను కొనుగోలు చేస్తారు.

ఇదిలా ఉండగా ఎంతో పవిత్రమైన ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు అని పండితులు తెలియజేస్తున్నారు.మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే.

Do Not Bring These Items On Dhanteras This Will Bring Badluck Dhanteras, Dhanter
Advertisement
Do Not Bring These Items On Dhanteras This Will Bring Badluck Dhanteras, Dhanter

ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయకూడదు.ఇలా ఇనుమును ధన త్రయోదశి రోజు కొనుగోలు చేయడం వల్ల సాక్షాత్తు శనీశ్వరుడిని మన ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుంది.ఇలా ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఇనుమును శనికి సంబంధించినదిగా భావిస్తారు.అలాగే పండితులు చెబుతున్న దాని ప్రకారం గాజు వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు రాహువుకు సంబంధించినది కనుక అంత పవిత్రమైన రోజున గాజు సామాన్లు ఇంటికి కొనుగోలు చేయకూడదు.

వీటితోపాటు ప్లాస్టిక్, పింగాణి వస్తువులను కూడా ధన త్రయోదశిరోజు కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళ్ళకూడదని పండితులు తెలియజేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు