స్త్రీల లాగే పురుషులకి కూడా మోనోపాజ్ వస్తుందా ?

మోనోపాజ్ .తెలుగులో చెప్పాలంటే రుతువిరతి.

సాధారణ భాషలో చెప్పాలంటే పీరియడ్స్ ఆగిపోవడం.

అంటే ఆండోత్సర్గం ఆగిపోవడం.

ఇంకా చెప్పాలంటే పిల్లల్ని కనే శక్తి కోల్పోవడం.మహిళలు సగటున 48-55 ఏళ్ల మధ్య ఈ స్టేజిలోకి ఎంటర్ అవుతారు.

అక్కడినుంచి శృంగార జీవితాన్ని ఆస్వాదించడమే తప్ప బిడ్డకు జన్మనిచ్చే ఆశ వదులుకోవాల్సిందే.మరి ఇలాంటి స్టేజి మగవారికి కూడా ఉంటుందా.

Advertisement

అంటే మగవారు కూడా మోనోపాజ్ దశకి చేరుకుంటారా ? మగవారు కూడా సంతానాన్ని కనే శక్తిని కోల్పోతారా ? మోనోపాజ్ అనేది ప్రతి స్త్రీ తన జీవితంలో చూసే స్టేజ్.కాని పురుషులలో అలా కాదు.

పురుషులు కూడా పిల్లల్ని కనే సామర్థ్యాన్ని కోల్పోతారు.కాని ఇది కామన్ విషయం కాదు.

అందరికి జరగదు.దీన్నే టెస్టోస్టీరోన్ క్షీణత అని అంటారు.

సైన్స్ భాషలో చెప్పాలంటే "అండ్రోపాజ్".ఇది అందరికి జరగదు.పురుషుల లైఫ్ స్టయిల్ ని బట్టే పురుషుడు ఈ స్టేజికి చేరుకోవడం, చేరుకోకపోవడం జరుగుతుంది.90 ఏళ్ల వయసు దాటినా తరువాత కూడా పిల్లలని కన్న ముసలివాళ్ళు ఉన్నారు, 50 దాటగానే చేతులు ఎత్తేసేవారు కూడా ఉన్నారు.చెప్పాంగా లైఫ్ స్టయిల్ ని బట్టి.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
మనీ ప్లాంట్ నాటేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివే!

మామూలుగానైతే టెస్టోస్టీరోన్ క్షీణత 30 ఏళ్ళు దాటిన తరువాత మొదలవుతుంది.సిగరెట్, మద్యం అలవాటు ఎక్కువ ఉంటే అంతకంటే ముందే మొదలవుతుంది అనుకోండి.

Advertisement

ఇక ఓ వయసుకి వచ్చాక, డయాబెటిక్ లాంటి సమస్యలు వస్తే, నిద్రలేమి సమస్య ఎక్కువ ఉంటే, పెద్దస్థాయిలో శాస్త్రచికిత్సలు జరిగితే, స్థూలకాయం, మద్యం పానం, సిగరెట్ అలవాటు అప్పటికి ఉంటే, టెస్టోస్టీరోన్ పడిపోతూ ఉంటాయి.ఇక ఈ హార్మోన్ లెవల్స్ దారుణంగా పడిపోతే, శృంగారం మీద ఆసక్తి తగ్గుతుంది, అలాగే పిల్లలని కనే సామర్థ్యం ఒక్కసారిగా పడిపోతుంది.

తాజా వార్తలు