వాట్సప్‌ వీడియో కాల్‌ తో విడాకులు.. బాబోయ్‌ టెక్నాలజీ ముందు ముందు మరేం చేస్తుందో కదా

మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి, కాలం మారినా నేను అక్కడే ఉంటాను అంటే మనుషులు మనను వింతగా చూస్తారు.

అందుకే కొత్తగా వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకుని, దాన్ని వినియోగించుకుంటు ముందడుగు వేయాలి.

అలా వేసినప్పుడే కొత్త జీవితంతో ఆనందంగా ముందుకు సాగుతాం.అయితే కొత్తగా వచ్చిన టెక్నాలజీ మరీ దారుణమైన మార్పులు తీసుకు వస్తుంది.

ఇలాంటి మార్పులు వద్దనుకున్న తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని అలవాటు చేసుకోవాల్సి వస్తుంది.అలవాటు చేసుకున్న తర్వాత అయ్యో అనుకోఆల్సి వస్తుంది.

కొత్తగా వచ్చిన టెక్నాలజీ వ్యక్తులు మాత్రమే కాకుండా వ్యవస్థల పని తీరును కూడా మార్చేస్తుంది.

Advertisement

ఇండియన్‌ పీనల్‌ కోర్డులో కూడా అనూహ్య మార్పులు తీసుకు వచ్చింది.మామూలుగా అయితే విడాకులు కోరుకునే భార్య భర్తలు కోర్టు ముందు హాజరు అయ్యి, ఇద్దరు కూడా తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది.కాని ప్రస్తుత కాలంలో భార్య భర్తలు ఒక్క చోట లేకుండానే టెక్నాలజీని ఉపయోగించేసుకుని విడాకులు ఇచ్చేస్తున్నారు.

ఆమద్య ముస్లీంలు వాట్సప్‌లో తలాక్‌ చెప్పి విడాకులు తీసుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.ఇప్పుడు నాగపూర్‌ కోర్టు విడాకులను వాట్సప్‌ ద్వారా ఇచ్చింది.వాట్సప్‌లో భార్యతో మాట్లాడి జడ్జ్‌ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

విడాకులు అంటే చిన్న విషయం కాదు, రెండు జీవితాలకు సంబంధించిన విడాకులను ఎలా సింపుల్‌గా వాట్సప్‌ వీడియో చూసి ఇచ్చేస్తారు అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

నాగపూర్‌లో ఈ విచిత్రమైన విడాకులు ఇచ్చిన జడ్జ్‌ మాత్రం తన నిర్ణయంను పూర్తిగా సమర్థించుకుంటున్నాడు.ఇద్దరు కూడా కోరుకున్నారు, ఆమె వాట్సప్‌ కాల్‌ లో పూర్తి స్వేచ్చగా తనకు విడాకులు కావాలని కోరింది.దాంతో పాటు అమెరికాలో ఉన్న ఆమె అన్ని పత్రాలను సరిగా ఇచ్చింది.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

భార్య భర్తలు కలిసి ఉండలేకుంటే విడాకులు తీసుకోవడం మంచిదే.వారు కలిసి కోర్టుకు రాలేనప్పుడు ఇలా వాట్సప్‌ వీడియో కాల్‌ లో వారిని విచారించి, వారిని ఒప్పించే ప్రయత్నం చేసి, ఒప్పుకోకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడంలో తప్పేం లేదని కొందరు అంటున్నారు.

Advertisement

మొత్తానికి వాట్సప్‌ వీడియో కాల్‌ లో మాట్లాడి విడాకుల తీర్పు ఇచ్చిన జడ్జ్‌ విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్‌ అయ్యింది.ముందు ముందు టెక్నాలజీతో మరెన్ని చిత్ర విచిత్రాలు చూస్తామో.ఇలాంటి చిత్రమైన సంఘటనలు మీ ప్రాంతంలో కూడా జరుగుతూనే ఉంటాయి, వాటిని మాకు తెలియజేయండి.

మొదట ఈ విషయాన్ని షేర్‌ చేయండి.

తాజా వార్తలు