అదృశ్యమైన ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్...అన్వేషిస్తున్న అధికారులు

భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ఎయిర్‌క్రాఫ్ట్ అదృశ్యమయ్యింది.ఈశాన్య రాష్ట్రం అసోంలోని జొర్‌హత్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఆచూకీ తెలియకుండా పోవడం ఐఏఎఫ్ వర్గాల్లో కలకలంరేపుతోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ సియాంగ్ జిల్లా మెచుకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు జొర్హట్ నుంచి మధ్యాహ్నం 12.24 గం.లకు ఈ ఎయిర్‌క్రాఫ్ట్ బయలుదేరింది.టేకాఫ్ అయిన 35 నిమిషాల తర్వాత ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కి గ్రౌండ్ ఏజెన్సీలతో సంబంధాలు తెగిపోయాయి.

మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌‌తో సంబంధాలు తెగిపోయాయని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు.

Disappeared An 32 Aircraft 32

సాధారణంగా సరకు రవాణా కోసం ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ని భారత వైమానిక దళం వినియోగిస్తూ ఉంటుంది.ఆచూకీ గల్లంతైన విమానంలో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు.నిర్ణీత సమయం లోపు గమ్య స్థానానికి చేరకపోవడంతో గల్లంతైన విమానం కోసం గాలిస్తున్నారు.

విమానం జాడ కనుగొనేందుకు అధికారులు సుఖోయ్-30 యుద్ధ విమానం, సీ-130 ప్రత్యేక విమానంను రంగంలోకి దింపారు.ఇప్పటివరకు కూడా ఆ విమానం ఆచూకీ తెలియకపోవడం తో అధికారులు కలవరపడుతున్నారు.

Advertisement
Disappeared An 32 Aircraft 32-అదృశ్యమైన ఏఎన్-32 ఎ�
చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..

తాజా వార్తలు