సికింద్రాబాద్ లో చిన్నారి అదృశ్యం కలకలం

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో చిన్నారి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

మహంకాళి పీఎస్ పరిధిలో ఆరేళ్ల పాప కృతికా కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

ఇంటి నుంచి బయటకు వచ్చిన కృతికా కనిపించడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు.

చిన్నారి కృతికా ఓ వ్యక్తితో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలతో పాప కోసం గాలిస్తున్నారు.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు