ప్రశాంత్ కిషోర్ చేరికపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు ?

రాజకీయ వ్యూహకర్త, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( ఐ ప్యాక్ ) అధినేత ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ లో చేర్చుకునే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎక్కువ మంది ఆయన చేరిక ను వ్యతిరేకిస్తున్నారు.

ముఖ్యంగా పార్టీలోని జీ 23 నేతలు ప్రశాంత్ కిషోర్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇందులోని కొంతమంది మాత్రమే ఆయన చేరికను సమర్థిస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి పైన, పార్టీలో చేపట్టాల్సిన ప్రక్షాళన గురించి 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సోనియాగాంధీకి లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్ నేతలను జీ 23  నేతలుగా పిలుస్తున్నారు.వారిలోని మెజారిటీ నాయకులు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేరికను వ్యతిరేకిస్తున్నారు.

అదే టీమ్ లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ మాత్రం ప్రశాంత్ కిషోర్ వంటి సమర్ధుడైన నాయకుడు కాంగ్రెస్ లో చేరాలి అంటూ తన వాదనను వినిపిస్తున్నారు.ప్రస్తుతం కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది అని, జాతీయస్థాయిలో అధికారంలోకి రావాలంటే చురుకైన యువ నాయకత్వం అవసరమని, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా పార్టీ నష్టపోయేది ఏమీ ఉండదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని వీరప్ప మొయిలీ తన వాదనను వినిపించారు.

Advertisement

అంతేకాదు ప్రశాంత్ కిషోర్ నేపథ్యం చూసుకున్నా, ఆయన అనేక పార్టీలకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించడం వంటివి వీరప్పమొయిలీ గుర్తుచేస్తున్నారు.ప్రశాంత్ కిషోర్ వంటి వారిని చేర్చుకోవడం ద్వారానే కాంగ్రెస్ బలోపేతమై అధికారాన్ని దక్కించుకోగలదు అంటూ వీరప్పమొయిలీ అధిష్టానం పెద్దలకు చెబుతున్నారు.

ఈ విషయంపైనే  సీనియర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది తేల్చుకోలేకపోతుంది.అయితే రాహుల్ ప్రియాంక లు మాత్రం ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే ముందుకు వెళ్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలదనే నమ్మకంతో ఉన్నారు.ఈ నేపథ్యంలో సోనియా దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు