ఎన్టీఆర్ తో సినిమా .. నాకు ఆలోచన రాలేదు.. వైవిఎస్ చౌదరి సంచలన వ్యాఖ్యలు!

నందమూరి కుటుంబానికి ఎంతో సుపరిచితమైన దర్శకులలో వైవిఎస్ చౌదరి( YVS Chowdary ) ఒకరు.

ఈయన దర్శకుడుగా నందమూరి నటసింహ బాలకృష్ణ అలాగే హరికృష్ణ గారితో సినిమాలు చేశారు.

ఇప్పుడు హరికృష్ణ( Harikrishna ) మనవడిని కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత నటుడు జానకిరామ్ మొదటి కుమారుడు ఎన్టీఆర్( NTR ) ను ఈయన ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వైవిఎస్ చౌదరి ఎన్నో విషయాలను అధికారికంగా వెల్లడించారు.

Director Yvs Chowdary Sensational Comments On Movie With Jr Ntr Details, Jr Ntr,

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను వైవిఎస్ చౌదరి అభిమానులతో పంచుకున్నారు.ఇలా హరికృష్ణ బాలకృష్ణతో సినిమాలు చేసిన ఈయన ఇప్పటివరకు ఎన్టీఆర్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.

Advertisement
Director Yvs Chowdary Sensational Comments On Movie With Jr Ntr Details, Jr Ntr,

ఈ విషయంపై అభిమానులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే  రిపోర్టర్స్ సైతం ఇదే ప్రశ్న ఆయనకు వేశారు.

Director Yvs Chowdary Sensational Comments On Movie With Jr Ntr Details, Jr Ntr,

ఇప్పటివరకు ఎన్టీఆర్( Jr NTR ) తో సినిమా చేయకపోవడానికి గల కారణం ఏంటని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు వైవిఎస్ చౌదరి సమాధానం చెబుతూ నేను సినిమా చేస్తున్నాను అంటే ఒక్కో సినిమాకు రెండు మూడు సంవత్సరాలు సమయం పడుతుంది.నా సినిమాకు నేనే కథ సిద్ధం చేసుకుంటాను.

అందుకే సినిమా ఆలస్యం అవుతుందని తెలిపారు.ఇక నేను సినిమా కథ రాసుకున్నప్పుడు ఈ కథ ఎవరికి సెట్ అవుతుందనే విషయాన్ని తెలుసుకుని వారిని సంప్రదిస్తానని వెల్లడించారు.

ఇక ఇప్పటివరకు నాకు ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనే ఆలోచన నా మైండ్ లోకి రాలేదని తెలిపారు.ఒకవేళ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి సరైన కథ సిద్ధమైతే తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా వైవిఎస్ చౌదరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు