దర్శకుడు వశిష్ట హీరోగా నటించిన ఆ సినిమా ఏంటో తెలుసా ?

బింబిసారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి డైరెక్టర్ గా వశిష్ట( Director Vasishta ) పరిచయం అయ్యాడు.

కళ్యాణ్ రామ్ ఒక కొత్త దర్శకుడుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు అని అందరూ అనుకున్నారు.

మరి వశిష్ట తీసిన బింబిసారా( Bimbisara ) ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలుసు.దాంతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒక హీరో దగ్గర నుంచి వశిష్టకు పిలుపు వచ్చింది.

అందుకే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో విశ్వంభరా( Vishwambhara ) అనే ఓ సినిమా తెరకెక్కుతుంది.మెగాస్టార్ తో పాటు ఆయన అభిమానులు అందరూ కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నారు.

అందుకు గల కారణాలు మనకు తెలియనివి కాదు.గతంలో ఆయన తీసిన సినిమాలు పరాజయం పాలవుతూ వస్తున్నాయి అందుకే అర్జెంటుగా చిరంజీవికి( Chiranjeevi ) ఒక హిట్టు సినిమా కావాలి.

Advertisement

అది క్రియేటివిటీ ఉన్న దర్శకుడి సినిమా అయితేనే బాగుంటుంది అని ప్రేక్షకుల అభిప్రాయం.

అయితే ఒక కొత్త దర్శకుడుని కేవలం ఒకే ఒక సినిమా తీసిన దర్శకుడిని చిరంజీవి నమ్మారు అంటే అందులో కారణాలు లేకపోలేవు.వశిష్ట 2000 వ సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చి అనేక సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.నా ఆటోగ్రాఫ్, సఖియా, భగీరథ, బన్నీ, ఢీ, బాడీ గార్డ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత డైరెక్టర్ గా మారడానికి దాదాపు 10 ఏళ్ల సమయం పట్టింది వశిష్ట కి.ఈ మధ్యలో 2007లో హీరోగా కూడా వశిష్ట ఒక సినిమాలో నటించాడు.ఆ సినిమా పేరు ప్రేమలేఖ రాశా.

( Premalekha Raasa ) లిరిక్ రైటర్ కులశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వశిష్ట హీరోగా నటిస్తే అంజలి హీరోయిన్ గా నటించింది.

ప్రేమలేఖ రాశా సినిమాలో రవితేజ మార్క్ నటన వశిష్టలో కనిపిస్తుంది.ఈ సినిమా ఆడలేదు.ఇక హీరోగా అతని కలలు కూడా ముందుకు వెళ్లలేదు.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

అందుకే డైరెక్షన్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు వశిష్ట.అలా ఒకే ఒక సినిమాతో హీరోగా తన ప్రయాణాన్ని ముగించిన వశిష్ట ప్రస్తుతం ఎవరు చేయలేని అద్భుతమైన సినిమాతో చిరంజీవి హీరోగా విశ్వంభర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు