Pawan Kalyan Mahesh Babu: పవన్ కళ్యాణ్, మహేష్ బాబులలో ఉన్న కామన్ క్వాలిటీ ఇదే: త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) మహేష్ బాబుతో కలిసి అతడు, ఖలేజా సినిమాలు డైరెక్ట్ చేశాడు.

ఇవి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టినా సినిమాలను చెప్పవచ్చు.

వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ పై ఏదో మ్యాజిక్ క్రియేట్ అవుతుంది.అందుకే వీరి కాంబోలో వస్తున్న అప్‌కమింగ్ మూవీ గుంటూరు కారం పై( Guntur Karam Movie ) కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో అగ్ర హీరో పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) కలిసి కూడా త్రివిక్రమ్ బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చాడు.పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

పవన్, మహేష్ లతో ఇలాంటి మంచి సినిమాలు తీసిన త్రివిక్రమ్ వారికి మంచి ఫ్రెండ్ కూడా అయ్యాడు.

Advertisement

సినిమాలు తీసే సమయంలో వీరిద్దరి గురించి త్రివిక్రమ్ చాలా విషయాల్ని తెలుసుకున్నాడు.రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరిలో ఒక కామన్ ఫీచర్ ఉన్నట్లు పేర్కొన్నాడు.అదే సింప్లిసిటీ( Simplicity ) అని వెల్లడించాడు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ."అతడు (2005) సినిమా తీసేటప్పుడు మహేష్ వార్డ్‌రోబ్‌లో రెండు షర్ట్స్, రెండు ప్యాంట్స్ మాత్రమే ఉండేవి.

షూటింగ్ తీసేటప్పుడు సినిమా వాళ్లు ఏ కాస్ట్యూమ్స్ ఇస్తే అవి మహేష్( Mahesh Babu ) వేసుకుంటాడు.షూటింగ్ అయిపోయాక వాటిని ఇచ్చేసి కారులో వెళ్లిపోతాడు.

అది ఎంత చిన్న కారైనా సరే దాంట్లో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు.ఖరీదైన బట్టలు, ఖరీదైన కారు కావాలని ఎప్పుడూ అనుకోడు.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

అలాగే ఉంటున్న ఇల్లు పెద్దదా చిన్నదా అనేది అతనికి అనవసరం.ఉండడానికి ఒక రూమ్ ఉంటే మహేష్ కి చాలు.

Advertisement

చూసుకోవడానికి సినిమాలు, చదువుకోడానికి బుక్స్ ఉంటే చాలు."

" పవన్ కళ్యాణ్ కూడా అంతే.రెండు షర్ట్స్, రెండు ప్యాంట్స్ ఉంటే సరిపెట్టుకుంటాడు.అతనికి చదువుకోడానికి నాలుగు బుక్స్ ఉంటే సరిపోతుంది.

మహేష్, పవన్ ఇద్దరూ కూడా చాలా సింపుల్ గా జీవిస్తారు." అని చెప్పుకొచ్చాడు.

త్రివిక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే గొప్ప వాళ్ళు ఎప్పుడు సింపుల్ గానే ఉంటారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవన్, మహేష్ బాబు నెలకొల్పిన రికార్డులు ఎన్నో! వీరిద్దరూ చేసిన సినిమాలు తక్కువే కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.

తాజా వార్తలు