గుర్రపు స్వారీ చేస్తున్న శంకర్.. RC15 సెట్స్ లో సందడే సందడి!

మావెరిక్ డైరెక్టర్ శంకర్ (Shankar) సినిమాలంటే వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాయి.ఇప్పుడంటే అంతా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ ఫేమస్ అయ్యారు.

కానీ శంకర్ అలా కాదు ఒక్క తమిళ్ లోనే సినిమాలు చేసి వరల్డ్ వైడ్ గా తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రతీ సినిమా గ్రాండ్ ఎలిమెంట్స్ తో సాలిడ్ ప్రమోషన్స్ తో హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోకుండా తెరకెక్కించడం శంకర్ కు వెన్నతో పెట్టిన విద్య.

అయితే రోబో తర్వాత మళ్ళీ అంతటి విజయాన్ని అందుకోలేక ప్రస్తుతం రేసులో వెనుకబడి ఉన్నాడు.కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని బలంగా కోరుకుంటున్నాడు.

అందుకు చాలా కష్టపడుతున్నాడు కూడా.ప్రజెంట్ శంకర్ రెండు సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో RC15 చేస్తూనే మరో వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 (Indian 2) సినిమా చేస్తున్నాడు.

ఎప్పుడు పవర్ ఫుల్ సబీజెక్టులను కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రజెంట్ చేసే శంకర్ ఈసారి రామ్ చరణ్ తో కూడా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తుండగా.

తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు (Dil Raju) తన బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ రోజు శంకర్ తన సోషల్ మీడియాలో ఒక బ్యూటిఫుల్ పిక్ షేర్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది.శంకర్ ఈ ఫొటోలో గుర్రపు స్వారీని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.RC15 సెట్స్ లో శంకర్ ఇలా సందడి చేయడంతో ఈ సినిమాలో కూడా చరణ్ గుర్రపు స్వారీ చేస్తున్న సన్నివేశాలతో అలరిస్తాడు అని మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.చూడాలి మరీ ఇందులో కూడా చరణ్ ఇలాంటి సన్నివేశాలు చేసి ఆకట్టు కుంటాడో లేదో.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు