పవన్ కళ్యాణ్ అభిమానినే..కానీ ఆయనతో సినిమా చెయ్యలేను అంటూ సందీప్ వంగ షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) వీరాభిమానులు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

వారిలో హరీష్ శంకర్, సుజిత్ , గోపీచంద్ మలినేని, బాబీ ఇలా లిస్ట్ తీస్తే పోతూనే ఉంటుంది.

వీళ్ళు కాకుండా అర్జున్ రెడ్డి మరియు కబీర్ సింగ్ సినిమాలతో ఇండియాని షేక్ చేసిన సందీప్ వంగ( Sandeep Vanga ) కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.ఈ విషయం ఆయన అనేక ఈవెంట్స్ లో, అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ వచ్చాడు.

ఇంత పెద్ద ఫ్యాన్ అయ్యుండి మీ తదుపరి చిత్రాలు ఎవరితో ఉండబోతున్నాయి అని విలేఖరులు అడిగితే ప్రభాస్,( Prabhas ) రామ్ చరణ్,( Ram Charan ) మహేష్ మరియు అల్లు అర్జున్ పేర్లు చెప్పాడు కానీ, పవన్ కళ్యాణ్ పేరు మాత్రం చెప్పలేదు.ఇదే పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎంతో బాధకి గురి చేస్తున్న విషయం.

కనీసం మాటవరుసకి అయినా పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలి కదా, ఎందుకు అలా చేస్తున్నాడు అని అభిమానులు జుట్టుపీక్కొని ఆలోచించినా కూడా అర్థం కావడం లేదు.అయితే ఇదే విషయాన్నీ సందీప్ ని రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో అడగగా పవన్ కళ్యాణ్ గారికి నేను చిన్నతనం నుండి వీరాభిమానిని, ఆయనతో సినిమా చెయ్యాలని నాకు మాత్రం ఎందుకు ఉండదు.అయితే ప్రస్తుతం ఆయనకీ ఉన్న రాజకీయ కార్యక్రమాల వల్ల( Politics ) ఎప్పుడు డేట్స్ ఇస్తాడు, ఎప్పుడు ఇవ్వరు అనేది క్లారిటీ ఉండదు.

Advertisement

అయినా కూడా నాకు చెయ్యాలనే ఉంటుంది.కానీ ముందుగా కమిట్మెంట్స్ అడిగిన హీరోలకు పూర్తి చెయ్యాల్సి వస్తుంది.ఇలాంటి సమయం లో అభిమానిని కదా అని ఫేక్ ప్రామిస్ లు చెయ్యలేను.

అందుకే పవన్ కళ్యాణ్ గారి పేరు ని చెప్పలేకపోయాను అని చెప్పుకొస్తాడు సందీప్ వంగ.

సందీప్ వంగ సినిమాల్లో హీరోల పాత్రలు చాలా యాటిట్యూడ్ తో అగ్రెసివ్ గా ఉంటుంది.ఇలాంటి పాత్రలకు రోల్ మోడల్ లాంటి హీరోల లిస్ట్ తీస్తే అందులో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానం లో నిలుస్తాడు.సందీప్ వంగ తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ ఈపాటికి ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది.

కానీ ఈ కాంబినేషన్ ప్రాక్టికల్ గా ఇప్పట్లో వర్కౌట్ అవ్వదు అనే విషయం తెలుసుకొని అభిమానులు చాలా బాధపడుతున్నారు.వాళ్ళ కోరికకు తగ్గట్టుగా ఎదో ఒక మ్యాజిక్ జరిగి పవన్ కళ్యాణ్ - సందీప్ వంగ కాంబినేషన్ సిద్ధం అయితే చాలా బాగుంటుంది.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు