మహేష్ బాబు సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్ర లో నటించనున్న రాజమౌళి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో దర్శకధీరుడు రాజమౌళి( Rajamouli ) తన కంటు ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు.

ఇక ఇదే క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ తో చేసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ను అందుకుంది.ఇక దాంతోపాటుగా త్రిబుల్ ఆర్ ( RRR ) సినిమాతో అంతర్జాతీయ గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు.

ఇక ఇప్పుడు మహేష్ బాబు తో( Mahesh Babu ) చేసే సినిమాతో పాన్ వరల్డ్ లో ఇంకో మెట్టు పైకి ఎక్కే విధంగా ఆ సినిమాని చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నట్టు గా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో రాజమౌళి కూడా నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.రాజమౌళి మంచి నటుడు ఆయన లాంటి నటులు ఇండస్ట్రీలో లేరనే చెప్పాలి.

Advertisement

కానీ ఇతను డైరెక్టర్ అవడం వల్ల పెద్దగా సినిమాల్లో నటించే అవకాశాలు రాలేదు.బాహుబలి లో( Baahubali ) చిన్న సీన్లో నటించినప్పటికీ అది పెద్ద క్యారెక్టర్ కాదు జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే చేశాడు.కాబట్టి ఇప్పుడు తన సినిమాలోనే తను ఒక క్యారెక్టర్ చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే ఆ క్యారెక్టర్ కి చాలా మంది ఆర్టిస్ట్ లను చూసినప్పటికీ ఆ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవ్వకపోవడంతో రాజమౌళి అయితేనే బాగుంటుందని తనకి తనే డిసైడ్ అయి ఆయనే ఆ క్యారెక్టర్ చేయాలని అనుకొని ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ఆయన చేసే పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందంటు రాజమౌళి సన్నిహితుల ద్వారా సమాచారం అయితే అందుతుంది.

Advertisement

తాజా వార్తలు