నేడు సీనియర్ నటుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి కావడంతో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
ఇకపోతే నేడు ఎన్టీఆర్ శతజయంతి కావడంతో పెద్ద ఎత్తున నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుని ఆయనకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు అంటూ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.తాను కాలేజీ చదువుకునే రోజులలో ఎన్టీఆర్ సినిమాలు చూసి నా జీవితంలో ఒక్కసారైనా ఆయనతో కలిసి సినిమా చేయగలనా అని అనుకున్నానని అయితే అదృష్టవశాత్తు ఆయనతో కలిసి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసే అవకాశం నాకు కలిగిందని రాఘవేంద్ర రావు తెలిపారు.
నా కెరీర్లో మొదటిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన సినిమాకు చేయడం, ఆయనపై క్లాప్ కొట్టడం నా అదృష్టంగా భావిస్తాను.అదే విధంగా ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అడవిరాముడు సినిమాకు దర్శకుడిగా ఎన్టీఆర్ నన్ను ఎంపిక చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అంటూ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.అడవి రాముడు అఖండమైన విజయాన్ని అందుకోవడంతో ఆయనతో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసే అవకాశం నాకు కలిగిందని, ఇవాళ ఇండస్ట్రీలో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం అన్నగారే,ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ రాఘవేంద్రరావు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy