డేరింగ్ అండ్ డాషన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన దర్శకత్వంలో తాజాగా లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి సినిమాలకు దూరంగా ఉన్నారు .లేకపోతే పూరి ఒక వైపు సినిమాలు చేస్తూనే పూరి మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో ఫిలాసఫీలను చెబుతూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా ఈయన తన మ్యూ జింగ్స్ ద్వారా మరో ఫిలాసఫీ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా మన జీవితంలో సగం గొడవలు తడ్కా ద్వారానే జరుగుతాయని చెప్పుకొచ్చారు.ఇక్కడ తడ్కా అంటే తాలింపు అని అర్థం వస్తుందని పూరి తెలిపారు.మనం ఒక వ్యక్తిని ఒక మరొక వ్యక్తి దగ్గరకు పంపిస్తే ఆయన నుంచి రాగానే ఆ వ్యక్తి ఏమన్నారనే విషయం వదిలిపెట్టి తన గురించి లేనిపోని మాటలు మనకు తెలియజేస్తూ ఉంటారు.
ఇలా తన గురించి లేనిపోనివన్నీ మనకు చెప్పాల్సిన తరువాత మనలో వారి గురించి ఒక అభిప్రాయాన్ని కలిగించి అనంతరం నిజం చెబుతారు.ఇలా పెనం మీద వేసినది తీసుకు రమ్మంటే మధ్యలో ఎన్నో తాలింపులు జోడించి మన వద్దకు అసలు విషయాన్ని తీసుకువస్తారు.
అసలు విషయం చెప్పకుండా తమ అభిప్రాయాన్ని చెప్పి.
అవతలి వాళ్లను విలన్స్ చేసేస్తాడు.తను ఎలా ఆలోచిస్తాడో.మనల్ని కూడా నెట్టేసి మన మనసు మొత్తంపాడు చేస్తున్నారు అందుకే మధ్యవర్తులు నిజం చెబుతున్నారా వారి అభిప్రాయాన్ని చెబుతున్నారా అనే విషయాన్ని గ్రహించాలి.
నువ్వు అనుకున్నది చెబుతున్నావా ? అని అడిగేయాలి.ఆ మధ్యవర్తులు మరెవరో కాదు.
మనమే.మనం జరిగినది అనుకున్నది మాత్రమే చెప్పాలి.
ఆ తర్వాత అడిగితేనే మీ ఓపినియన్ చెప్పాలి.ప్రపంచంలో ప్రతిరోజు గొడవలు జరగడం సగం జీవితాలు నాశనం కావడం కేవలం తడ్కా వల్ల మాత్రమే జరుగుతున్నాయని ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మరో ఫిలాసఫీని తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy