ఈ దర్శకుడు మల్టీ ట్యాలెంటెడ్‌.. అంతటా ఇతడే!

అ! అనే విభిన్నమైన సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.( Prashanth Varma ) ఈ మధ్య కాలంలో ఇతడి పేరు ప్రముకంగా వినిపిస్తుంది.

2018 సంవత్సరంలో అ! సినిమా తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్‌ వర్మ చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా అందరు హీరోల ఫ్యాన్స్ కి చాలా దగ్గర అయ్యాడు.ఈయన ఒక సినీ దర్శకుడిగా మాత్రమే కాకుండా కమర్షియల్‌ యాడ్స్ మేకర్ గా మరియు ఇంకా ఎన్నో రకాలుగా ఈవెంట్స్ ను ప్లాన్‌ చేసే మంచి ఈవెంట్‌ ప్లానర్ గా కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.

ఈయన తన సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమా లకు మరియు ఇతర దర్శకుల సినిమా లకు కూడా స్క్రిప్ట్‌ ను అందిస్తాడు.పూర్తి స్క్రిప్ట్‌ వర్క్ కాకున్నా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగస్వామ్యం వహిస్తాడు.ప్రస్తుతం ఈయన తేజ హీరోగా హను మాన్‌( HanuMan Movie ) అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా యొక్క టీజర్‌ చూసిన తర్వాత ఆదిపురుష్ కు ఏమాత్రం తక్కువ కాదు అంటూ అంతా మాట్లాడుకున్నారు.ఆ సినిమా కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

Advertisement

తాజాగా ఆదిపురుష్( Adipurush ) యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ యొక్క బాధ్యత మొత్తం కూడా తన భుజాలపై వేసుకున్నాడు.దర్శకుడు ప్రశాంత్ వర్మ యొక్క ప్లానింగ్ తో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సక్సెస్ అయ్యిందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు ఇలా ఈవెంట్‌ ను డిజైన్‌ చేయడం గతంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు.

ఇక దర్శకుడు బుల్లి తెర కార్యక్రమాలు మరియు ఓటీటీ కార్యక్రమాల కోసం టీజర్ లను కూడా షూట్‌ చేయడం చేస్తూ ఉన్నాడు.ఇలాంటి మల్టీ ట్యాలెంటెడ్‌ దర్శకుడి గురించి ఎంత చెప్పినా తక్కువే.

Advertisement

తాజా వార్తలు