నేను తీసినట్లుగా ఉంచితే ఫలితం మరోలా ఉండేది

బాలీవుడ్‌లో తాజాగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మణికర్ణిక చిత్రంకు మిశ్రమ స్పందన వస్తోంది.మొదట ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహించాడు.

తెలుగు దర్శకుడు మణికర్ణికకు దర్శకత్వం వహించడంతో సౌత్‌ ఆడియన్స్‌లో కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని అంతా భావించారు.

కాని సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయిన సమయంలో క్రిష్‌ను బయటకు నెట్టి కంగనా అన్ని మార్పులు చేర్పులు చేసేసింది.

కంగనా రనౌత్‌ దర్శకత్వంలో సినిమా పూర్తి అయ్యింది.ఆమె బాలీవుడ్‌ మీడియాలో సినిమా మొత్తం తానే పూర్తి చేసినట్లుగా చెప్పుకొచ్చింది.సినిమాకు సంబంధించిన పలు సీన్స్‌ను తాను ఎడిట్‌ చేశానంటూ పేర్కొంది.

Advertisement

మంచి స్క్రీన్‌ప్లేతో తాను చేసిన సినిమాకు మంచి ఆధరణ దక్కుతుందని పేర్కొంది.అయితే తాజాగా క్రిష్‌ ఆ సినిమాపై స్పందిస్తూ తాను తీసిన మణికర్ణిక బంగారం అయితే, ఇప్పుడు వచ్చింది వెండి అంటూ కామెంట్‌ చేశాడు.

తాను తీసింది తీసినట్లుగా ఉంచి ఉంటే ఫలితం మరోలా ఉండేదంటూ కామెంట్‌ చేశాడు.

విడుదలకు ముందు పెద్దగా మాట్లాడని క్రిష్‌ ఇప్పుడు మాత్రం ఆ సినిమా నాది, నేను తీసిన వర్షన్‌ కొన్నింటిని మార్చి కొత్తగా సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం క్రిష్‌ ఎన్టీఆర్‌ మహానాయకుడు చిత్రం బిజీలో ఉన్నాడు.అందుకే ఆయన మణికర్ణిక గురించి మరింతగా స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు.

త్వరలోనే మణికర్ణికపై పూర్తి స్థాయిలో స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఇక మహానాయకుడు సినిమాను వచ్చే నెల చివర్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

Advertisement