వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భారీ అంచనాల నడుమ ఇప్పుడు ఎఫ్ 3 సినిమా రూపొందింది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఎఫ్ 3 ఉంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా ఎఫ్ 3 సినిమా ను ఫ్యామిలీ ఆడియన్స్ కు రీచ్ అయ్యే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
సోషల్ మీడియా ద్వారా యూత్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా ప్లాన్ చేశారు.మొత్తంగా ఎఫ్ 3 సినిమా ను ఎక్కువ మంది చూసే విధంగా ఒక సేఫ్ డేట్ లో అన్ని అనుకుని దిల్ రాజు విడుదల చేయబోతున్నాడు.
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటీ అంటే ఎఫ్ 3 సినిమా కు సోలో రిలీజ్ దక్కింది.ఈ మద్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలకు తప్ప ఏ మీడియం రేంజ్ సినిమా లకు చిన్న సినిమాలకు సోలో రిలీజ్ దక్కలేదు.
కాని ఎఫ్ 3 కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్ వేసి మరే సినిమా ను కూడా ఈనెల 27న విడుదల కాకుండా ప్లాన్ చేశాడు.ఇప్పుడు పెద్ద సినిమా ల హడావుడి కూడా ఏమీ లేదు.
గతంలో విడుదల అయిన సినిమా ల వల్ల ఏమైనా పోటీ ఉంటుందా అంటే అది కూడా లేదు.తదుపరి వారం కూడా ఎక్కువ పోటీ ఉండబోదు.కనుక రెండు వారాల పాటు ఎఫ్ 3 సినిమా థియేటర్లలో కుమ్మేయడం ఖాయం అంటున్నారు.
మినిమం గా ఉంది.యావరేజ్ గా ఉంది అనే టాక్ వస్తే ఖచ్చితంగా అద్బుతమైన వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్ 2 దాదాపుగా వంద కోట్లు వసూళ్లు చేసింది.కనుక ఎఫ్ 3 ఖచ్చితంగా 150 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy