వామ్మో దిల్ రాజు.. బలగం సినిమాను అక్కడ నుంచి పట్టుకచ్చడా ?

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడుగా మారి నిర్మాత దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా బలగం.

ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి హీరోయిన్ గా మారిన కావ్య నీ తీసుకోగా హీరోగా ఆ కమీడియన్ ప్రియదర్శి నటిస్తున్నాడు.

ఇక ఒక చిన్న దర్శకుడికి ఇంత పెద్ద సినిమా బాధ్యతను దిల్ రాజు ఇచ్చినప్పుడే దీని వెనకాల మతలబు ఏంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు.ఇక పైగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఈవెంట్ ని సిరిసిల్లలో అరేంజ్ చేసి దానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ ని పిలవగానే దిల్ రాజుని అందరూ అంచనా వేయడం మొదలుపెట్టారు.

రూపాయి ఆదాయం లేనిది అర్ధ రూపాయి పని కూడా చేయడు దిల్ రాజు.అలాంటి వ్యక్తి తెలంగాణ నేపద్యంలో ఒక సినిమా తీస్తూ, ఆ సినిమా ఈవెంట్ కి కేటీఆర్ ను పిలిచాడు.

పైగా తెలంగాణ యాసలో కమీడియన్ ప్రియదర్శి ముందు నుంచి దిట్ట కాబట్టి అతనిని మెయిన్ లీడ్ గా ఎంచుకున్నాడు.ఈ పరిణామాల మధ్య అందరూ తెలంగాణ భాషను, ఆ సంస్కృతిని ఎంకరేజ్ చేసినందుకు సంతోషపడుతున్న అసలు విషయం వేరే ఉంది.

Advertisement
Dil Raju Copied Story From Telangana Writer, KTR, Comedian Priyadarshi, Gaddam S

అదే ఈ సినిమా కథ.ఈ సినిమా కథ చనిపోయిన తర్వాత కాకులకు పిండం పెట్టడం నేపద్యంలో ఉంటుంది.కాకికి పెట్టిన పిండం ముట్టకపోతే మరణించిన వారి ఆత్మలు విముక్తి పొందవు అనే నేపథ్యంలో పూర్తిగా ఈ కథ ఉంటుంది.

Dil Raju Copied Story From Telangana Writer, Ktr, Comedian Priyadarshi, Gaddam S

ఇలాంటి కథతో ఇప్పటికే గడ్డం సతీష్ అనే ఒక రైటర్ తను రాసుకున్న కథగా ఆరోపిస్తున్నాడు.ఇదే కథను గతంలో ఒక వార్త పత్రికలో కూడా అచ్చు అయింది.పైగా తన కథను కాపీ కొట్టినప్పుడు ఒక్క మాటైనా చెప్పి ఉంటే బాగుండేదని సదరు రైటర్ భావిస్తున్నాడు.

కానీ ఈ లైన్ ఎక్కడి నుంచి తీసుకున్నది దిల్ రాజు చెప్పకపోయినా సోషల్ మీడియాలో మాత్రం కాపీ కొట్టి సినిమా తీసినట్టుగా పలు వ్యాఖ్యానాలు మొదలయ్యాయి.మరి ఈ వ్యాఖ్యలపై దిల్ రాజు అండ్ టీం ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇప్పటికే పెయిడ్ రివ్యూస్ మొదలయ్యాయి.సినిమా ఎలా ఉందో తెలియక పోయిన ఆహా, ఓహో అంటూ పలు వెబ్ సైట్స్ సినిమా పై రివ్యూలు రాస్తున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు