హైదరాబాద్ గాంధీభవన్‎కు దిగ్విజయ్ సింగ్..!

తెలంగాణ కాంగ్రెస్ అడ్వైజర్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ లోని గాంధీభవన్ కు చేరుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభానికి తెర దించేందుకు పార్టీ అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే.

గాంధీభవన్ కు చేరుకున్న దిగ్విజయ్ సింగ్ ముందుగా పీఏసీ కమిటీతో భేటీకానున్నారు.మధ్యాహ్నం నుంచి నేతలతో వేరు వేరుగా డిగ్గీ రాజా సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి అనుకూల వర్గాల నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు.సాయంత్రం అనుబంధ సంఘాల నేతలతో దిగ్విజయ్ భేటీ కానున్నారు.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు