Jagapathi Babu , Krishnavamsi : కృష్ణవంశీ అంతఃపురం లో జగపతి బాబు క్యారెక్టర్ కి మొదట ఆ హీరోను అనుకున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ( Krishnavamsi ) ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుందని ప్రేక్షకులందరిలో ఒక మంచి గుర్తింపును పొందాడు.

ఇక ఎలాంటి క్రమంలోనే ఆయన సౌందర్య, ప్రకాష్ రాజ్ ( Soundarya, Prakash Raj ) లాంటి స్టార్ నటులను ప్రధాన పాత్రల్లో పెట్టి తీసిన అంతఃపురం సినిమా ( Anthapuram )అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.

అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర మాత్రం చాలా హైలెట్ అనే చెప్పాలి.

ఇక ఇది ఇలా ఉంటే ఒక ఈ సినిమాలో ఒక పది నిమిషాల పాత్ర కోసం జగపతిబాబు( Jagapathi Babu ) కనిపిస్తాడు.సౌందర్య ను సేవ్ చేసే క్యారెక్టర్ లో కనిపించడమే కాకుండా ఆ పాత్రలో మెప్పించాడనే చెప్పాలి.అయితే ఈ క్యారెక్టర్ కోసం మొదట శ్రీకాంత్ ని అనుకున్నారట.

కానీ శ్రీకాంత్ కి టెస్ట్ షూట్ చేసిన తర్వాత శ్రీకాంత్ ( Srikanth ) ఎందుకో ఈ క్యారెక్టర్ కి ఫిట్ అవ్వడు అని తెలుసుకున్న కృష్ణవంశీ ఆ క్యారెక్టర్ లోకి జగపతి బాబును తీసుకొచ్చాడు.ఇక జగపతిబాబు నటన చాలా న్యాచురల్ గా ఉంటుంది.

Advertisement

ఇక ఆయన పాత్ర అంత ఎఫెక్టివ్ గా రావడానికి అది చాలా ప్లస్ అయింది అంటూ చాలా సందర్భల్లో కృష్ణవంశీ తెలియజేయడం విశేషం.

ఇక ఈ సినిమాలో తర్వాత చేసిన ఖడ్గం సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కోసం శ్రీకాంత్ ను తీసుకొని ఆయన చేత ఆ క్యారెక్టర్ చేయించి సూపర్ సక్సెస్ ని అందుకున్న ఘనత కూడా కృష్ణ వంశీ కే చెందుతుంది.అందుకే ఒక క్యారెక్టర్ కి ఎవరు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు ఎవరు పర్ఫెక్ట్ గా ఆ క్యారెక్టర్ ను పొట్రే చేస్తారు అనేది నిర్ణయించుకునే బాధ్యత కూడా డైరెక్టర్ మీదనే ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు