ఈ గ‌ద్ద‌ను చూశారా చిరుత లాగా ఎలా వేటాడిందో..

అడ‌విలో జంతువుల వేట‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఎందుకంటే ఈ వేట మ‌న‌కు బ‌హిరంగంగా చూడాల‌న్నా కూడా ఎక్క‌డా క‌నిపించ‌ద‌నే చెప్పాలి.

ఇక ఈ వేట‌కు సంబంధించిన వీడియోలే గానీ ఫొటోలే గానీ మ‌న‌కు సోష‌ల్ మీడియాలో అక్క‌డక్క‌డా క‌నిపిస్తుంటాయి.ఇక వీటిని చూసేందుకు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

వీటిని చూసిన వారంతా కూడా ఎంతో ఆస‌క్తిగా కామెంట్లు పెట్ట‌డాన్ని మ‌నం గ‌మ‌నించొచ్చు.ఇక ఇప్పుడు జంతువుల‌కు సంబంధించి కాకుండా ఓ గ‌ద్ద‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

నిజానికి జ‌తువుల వేట‌కు కాదు గ‌ద్ద‌ల‌కు సంబంధించిన వేట కూడా ఎంతో ఆస‌క్తిగా ఉంటుంద‌ని ఈ వీడియో చూసిన త‌ర్వాతే అనిపిస్తోందేమో.ఎందుకంటే ఈ వీడియోలో గ‌ద్ద వేట అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంట‌.

Advertisement
Did You See This Eagle How It Hunted Like A Leopard, Hill, Viralvideo, Viral Ani

గ‌ద్దలు ఎంతో చక్క‌ని వ్యూహాన్ని రచించడమే కాకుండా దాన్ని ఎంతో బాగా అమ‌లు చేస్తుంటాయి.గ‌ద్ద‌ల‌కు ఏదైనా ఆహారం దొరికితే ఆ జంతువును ఎక్క‌డ‌కు పారిపోకుండా చాలా చాక‌చ‌క్యంగా వేటాడి మ‌రీ త‌మ ఆహారంగా మార్చుకుంటాయి.

Did You See This Eagle How It Hunted Like A Leopard, Hill, Viralvideo, Viral Ani

ఇక ఇప్పుడు మ‌నం మాట్లాడుకోబోయే వీడియోలో ఒక ప్రాంతం నుంచి మరో ఏరియాకు కొన్ని పక్షులు ఎగురుకుంటూ వెళ్ల‌డాన్ని గ‌మ‌నించ‌వచ్చు.ఇక ఆకాశంలో ఎగురుతున్న గ‌ద్ద ఎక్కడ నుంచి వాటిని గ‌మ‌నించిందో వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా వేట‌కు రెడీ అయిపోతుంది.చిరుత వేగంతో ఆ గ‌ద్ద ఓ పక్షిని తన క‌త్తుల్లాంఇ కాళ్లతో క్యాచ్ చేయ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఇక ఆ త‌ర్వాత ఆ ప‌క్షి కాస్తా ఆ గ‌ద్ద‌కు ఆహారంగా మారిపోతుంది.ఇక ఇప్పుడు ఈ సీన్ల‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది.

మ‌రి మీరు కూడా ఓ లుక్కేయండి.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు