కలలో ఆరిపోయిన దీపం కనిపించిందా..? అయితే ఈ ప్రమాదం తప్పదు..!

సాధారణంగా నిద్రపోయాక కలలు రావడం సహజం.అయితే కొన్నిసార్లు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్ గా కొన్ని చెడు కలలు మమ్మల్ని బాగా డిస్ట్రబ్ చేస్తాయి.

ఆ కలలో టెన్షన్ పడిన, కంగారు పడినా, భయపడినా ఆ ఎఫెక్ట్ నిద్రపోతున్న మన మీద బాగా ఉంటుంది.ముఖం ఫ్రెష్ గా కనిపించదు.

అలాగే కలలో ఏవేవో కనిపిస్తూ ఉంటాయి.అయితే అలాంటి వాటికి కొన్ని సంకేతాలు ఉన్నాయి.

కలలో కనిపించే ప్రతి వస్తువు, రంగు భవిష్యత్తులో జరగబోయే దానికి ఒక సంకేతం అని స్వప్న శాస్త్రం( science of dreams ) చెబుతోంది.కొన్ని కళలు మంచివి ఉంటాయి.

Advertisement

అయితే మరికొన్ని చెడువి కూడా ఉంటాయి.కొన్నిసార్లు మనకు కలలో దీపాలు, మంట కనిపిస్తాయి.

ఇది కనిపించే విధానాన్ని బట్టి ఆ కలకు కూడా అర్థం ఉంటుంది.కలలో మండుతున్న లేదా ఆరిపోయిన దీపం( lamp ) కనిపిస్తే దానికి చాలా అర్థాలు ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన కలలో వెలుగుతున్న లేక మండుతున్న దీపాన్ని చూస్తే అది ఒక శుభ సంకేతమని చెప్పాలి.అలాగే మండుతున్న దీపం స్వప్నంలో కనిపించడం వలన మనకు భవిష్యత్తులో కలగబోయే గౌరవం, ప్రతిష్టకు అర్థం.

ఇక కలలు వెలుగుతున్న దీపం కనిపించడం రాజ యోగానికి కూడా సంకేతం అని చెప్పాలి.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్29, ఆదివారం 2024

దీపపు వెలుగు చీకటిని పారద్రోలి కాంతిని పంచుతుందో అదే విధంగా జీవితం నుంచి అపజయం దూరం అయిపోయి విజయం చేకూరుతుందని దీనికి అర్థం అని పండితులు చెబుతున్నారు.ఇక కలలో ఆరిపోయిన దీపం కనిపిస్తే దీపం అశుభ సూచన.ఇలా కలలో ఆరిపోయిన దీపం కనిపిస్తే మన సంకల్ప శక్తి బలహీన పడిపోతుంది.

Advertisement

ఇక ఏ పనిలో కష్టపడి పని చేసినా కూడా తగిన ఫలితం దక్కదు.అంతేకాకుండా కలలో ఆరిపోయిన దీపం కనిపిస్తే వైఫల్యాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలతలు, ఉన్నట్టు సూచన.

అందుకే ఇలాంటి పీడకలలు వచ్చినప్పుడు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మంచిది.

తాజా వార్తలు