కాలికి నల్లతాడు ఏ రాశి వారికి మంచిది...ఏ రాశివారు కట్టుకోకూడదో తెలుసా?

సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది కాలికి నల్ల దారం కట్టడం మనం చూస్తుంటాము.

ఇది కట్టడంవల్ల తమ పై ఎలాంటి ప్రభావం ఉండదని చాలా మంది భావిస్తారు.

అయితే ఇది ప్రస్తుత కాలంలో ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.కొందరు సాధారణ దారాలను కాలికి కట్టగా మరికొందరు వీటికి వివిధ రకాల పూసలు జోడించి కాళ్లకు కడుతారు.

అయితే నల్ల దారం అనేది ప్రతి ఒక్కరికి సరిపోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్పరు.కొన్ని రాశుల వారికి మాత్రమే నల్లతాడు కట్టడం వల్ల శుభం జరుగుతుందని, మరికొందరిలో ఈ నల్ల తాడు అశుభాన్ని కలుగజేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మరి నల్ల తాడు ఏ రాశి వారికి మంచిది ఎవరు కట్టుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల తాడులో కేవలం ధనస్సు, తుల, కుంభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది.

Advertisement
Did You Know Which Horoscope Person Will Tie Black Thread Horoscope, Black Threa

ఈ రాశిచక్రాలలో పుట్టిన వారు ఎలాంటి సంకోచాలు వ్యక్తం చేయకుండా నిరభ్యంతరంగా నల్లతాడును కట్టుకోవచ్చు.ఈ క్రమంలోనే వృశ్చిక రాశి, మేష రాశిలో జన్మించిన వారికి నల్ల తాడు కలిసిరాదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశిని, మేష రాశిని అంగారకుడు ఆదీనంలో ఉంటాయి కనుక ఈ రెండు రాశుల వారు నల్లతాడును కట్టుకోకూడదు.ఈ రాశుల వారు నల్ల తాడు ధరిస్తే వీరికి ఎల్లప్పుడు అశుభాలు, మనశ్శాంతి కరువవడం, అధిక ఆందోళనలు కలుగుతాయి.

Did You Know Which Horoscope Person Will Tie Black Thread Horoscope, Black Threa

నల్ల దారం ధరించేటప్పుడు చాలా మంది వారి ఇష్టానుసారంగా ధరిస్తుంటారు.అయితే నల్లతాడు ధరించేవారు తప్పకుండా మంచి సమయం చూసి ధరించాలి.ఈ నల్ల తాడును ధరించేటప్పుడు ముందుగా రుద్ర గాయత్రి మంత్రం పఠించండి ఈ విధంగా గాయత్రీ మంత్రం చదివిన తర్వాత దారం తొడగాలి.

అయితే ఇంతకు ముందు మన చేతికి పసుపు లేదా ఎరుపురంగు దారాలు ఉంటే నలుపు దారాన్ని తొడగాల్సిన పనిలేదు.ముఖ్యంగా నల్ల దారం కాలికి ధరించేవారు శనివారం ధరించడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

శనివారం శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు.శనికి నలుపు అంటే ఎంతో ఇష్టం కనుక శనివారం రోజు నలుపు దారాన్ని ధరిస్తూ రుద్ర గాయత్రి మంత్రం జపించడం వల్ల ఈ తాడుకు మరింత బలం కలిగి అన్ని శుభాలను కలిగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు