మీ కరెంట్ మీటర్ రీడింగ్ ఎంతో తెలుసుకొని, మీరే బిల్లు కట్టుకోవచ్చు తెలుసా?

ఈ మధ్య కాలంలో చూసుకుంటే కరెంటు బిల్లులు పగిలిపోతున్నాయా కదా.ఈ క్రమంలో జనాలకు అనేక అనుమానాలు కలుగుతూ ఉంటాయి.

కరెంట్ మీటర్ తప్పుగా తిరుగుతుందేమో, స్పీడుగా తిరుగుతుందేమో అన్న అనుమానాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి.అయితే సాంకేతికత వచ్చిన తరువాత ఈ రోజుల్లో చాలామంది ఆన్లైన్లోనే కరెంట్ బిల్లులు( Electricity Bill ) పే చేసేస్తున్నారు.

అయితే ఇపుడు మీ కరెంట్ మీటర్ రీడింగ్ ఎంతో తెలుసుకొని, మీరే బిల్లు కట్టుకోవచ్చనే విషయం మీకు తెలుసా.

Did You Know That You Can Pay Your Own Bill By Knowing Your Current Meter Readi

మీటర్లలో వచ్చిన రీడింగ్ ఆధారంగా మనము బిల్లు చెల్లిస్తూ ఉంటాం.ఒక్కోసారి బిల్లు కొట్టే వారు రెండు మూడు రోజులు ఆలస్యంగా వస్తే మన విద్యుత్ వాడకం స్లాబ్ దాటిపోయి బిల్లు ఎక్కువ చెల్లించాల్సి వాస్తు ఉంటుంది.ఇలాంటప్పుడు అరెరే.

Advertisement
Did You Know That You Can Pay Your Own Bill By Knowing Your Current Meter Readi

ఎంత బిల్లు వచ్చేసింది అని చాలామంది ఆశ్చర్యపోతూ వుంటారు.అలాగే కొంతమంది ఒక్కోసారి బిల్లు కట్టడం మరిచిపోతూ వుంటారు.

ఇలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా మనకు ఇష్టమొచ్చినప్పుడు బిల్లు కట్టుకోవచ్చనే విషయం మనలో చాలామందికి తెలియదు.

Did You Know That You Can Pay Your Own Bill By Knowing Your Current Meter Readi

అవును, ఇపుడు మీ విద్యుత్ మీటర్ రీడింగ్( Current meter ) మీరే స్కాన్ చేసుకోవడానికి ఒక యాప్ అందుబాటులో వుంది.టీఎస్ఎస్పీడీసీఎల్ ఇపుడు సెల్ఫ్ మీటర్ రీడింగ్( Self Meter Reading ) పేరుతో భారత్ స్మార్ట్ సర్వీసెస్ అనే యాప్ ను తీసుకొచ్చింది.ఈ యాప్ లో కన్సూమర్ సెల్ఫ్ బిల్లింగ్ అనే ఆప్షన్ ఉంటుంది.

మీరు ఏ మీటర్ రీడింగ్ తీసుకోవాలనుకుంటున్నారో.ఆ మీటర్ వద్దకు వెళ్లి, మీ యాప్ లో కన్సూమర్ సెల్ఫ్ బిల్లింగ్ పై క్లిక్ చేయగానే స్కాన్ చేయమని ఉడుగుతుంది.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

అప్పుడు మీరు మీటర్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది.అలా చేయగానే మీ బిల్లు కనిపిస్తుంది.

Advertisement

తద్వారా మీరు కరెంటు బిల్లు చెల్లించుకోవచ్చు.

తాజా వార్తలు