దేశంలోనే ఫస్ట్ టైం రైళ్లలో RTC బస్సుల రవాణా జరుగుతోంది తెలుసా?

ఇండియన్ రైల్వేలో గూడ్స్‌ రైళ్ల సేవలు ఎనలేనివి.నిత్యం దేశానికి అవసరమైన ఇంధనం, బొగ్గు, రకరకాల నిత్యావసర సరుకులను రవాణా చేస్తుంటాయి.

అంతేకాకుండా వాహనాలు అయినటువంటి బైక్‌ లు, ట్రాక్టర్లు, లారీలు మొదలైనవి గూడ్స్ రైళ్ల ద్వారానే తరలిస్తుంటారు.అయితే ఇదే కోవలో తాజాగా భారతీయ రైల్వే మరో మంచి చర్య చేపట్టింది.

ఇప్పటి వరకు గూడ్స్​ రైళ్లలో బస్సులను రవాణా చేసిన ఘటనలు లేవనే చెప్పాలి.అయితే దేశ చరిత్రలోనే తొలిసారిగా RTC బస్సులను రవాణా చేసి సరికొత్త అధ్యయనానికి తెర తీసింది భారతీయ రైల్వే.

అవును, మీరు నిన్నది నిజమే.ఇంతకీ ఎక్కడి నుండి ఎక్కడికి తరలించిందంటే, బెంగళూరు నుంచి పంజాబ్​ రాజధాని చండీగఢ్​ కు 2 దఫాల్లో బస్సులను తరలించింది.

Advertisement
దేశంలోనే ఫస్ట్ టైం రైళ్లలో RTC బ

RTC చెందిన బస్సులను గూడ్స్‌ రైళ్లలో తరలిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ట్వీట్‌ చేయగా అనేకమంది లైక్స్ చేస్తున్నారు.

బెంగళూరులోని అశోక్ లేలాండ్ సంస్థ 300 బస్సుల ఉత్పత్తికి హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.తమిళనాడులోని హోసూర్‌, కర్ణాటకలోని బెంగళూరులో వీటిని తయారు చేశారు.

దేశంలోనే ఫస్ట్ టైం రైళ్లలో Rtc బ

రోడ్డు మార్గంలో బస్సులను తరలించాలంటే భారీ స్థాయిలో ఖర్చవుతుంది.పైగా ఇంధన ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి.ఈ నేపథ్యంలో రైల్వే ద్వారా అయితే కాస్త చవకగా రవాణా చేయొచ్చని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

బస్సులు తయారైన బెంగళూరులోని దొడ్డబళ్లాపుర నుంచి చండీగఢ్‌ వరకు 2,825 కిలోమీటర్ల దూరం ఉంటుంది.అక్కడికి చేరుకునేందుకు 5 రోజుల సమయం పడుతుంది.ఈ కారణంగానే బస్సులను రైలులో రవాణా చేశారు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

మే 15న 32 బస్సులు.మే 20న మరో 32 బస్సులను రైలులో రవాణా చేసింది అశోక్​ లేలాండ్​.

Advertisement

అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్‌ కు రోడ్డు మార్గంలో బస్సులను తరలిస్తారు.

తాజా వార్తలు