రోజు ఇది చేయకుంటే స్మోకింగ్ కంటే ఎక్కువ హాని కలుగుతుంది తెలుసా?

ధూమపానం ఆరోగ్యానికి హానికరం.ఈ విషయం అందరికీ తెలుసు.

కానీ స్మోకింగ్ అలవాటును మాత్రం వదులుకోలేకపోతుంటారు.

ఇటీవల రోజుల్లో స్మోకింగ్ అనేది కోట్లాది మందికి వ్యసనంగా మారింది.

ఈ చెడు వ్యసనం కారణంగా ప్రతి సంవత్సరం మన ఇండియాలోనే కొన్ని లక్షల మంది మృతి చెందుతున్నారు.స్మోకింగ్ చేసే వారే కాదు.

వారి చుట్టూ ఉన్న వారు సైతం జబ్బుల బారిన పడుతున్నారు.అయితే స్మోకింగ్ కంటే ప్రమాదకరమైనది మరొకటి ఉన్నది.

Advertisement
Did You Know That Not Exercising Is More Dangerous Than Smoking? Smoking, Exerci

అదే వ్యాయామం చెయ్యకపోవడం.అవును మీరు విన్నది నిజం.

వ్యాయామం చేయకపోవడం అనేది స్మోకింగ్ వ్యసనం కంటే ఎంతో హానికరమైనది.వ్యాయామం చేయకపోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తదితర సమస్యలన్నీ చుట్టు ముట్టి మనల్ని మరణానికి చేరువచేస్తాయి.

స్మోకింగ్ చేయడాన్ని ఒక వ్యాసనంగా భావిస్తూ ఉంటాము.కానీ వ్యాయామం చెయ్యకుండా బద్దకిస్తూ ఉండటం అనేది సెగరెట్ వ్యాసనం కంటే చాలా భయంకరమైనది మరియు ప్రమాదకరమైనది.

Did You Know That Not Exercising Is More Dangerous Than Smoking Smoking, Exerci

అందుకే ఆరోగ్య నిపుణులు వ్యాయామాన్ని తమ డైలీ రొటీన్ లో భాగం చేసుకోవాలని ఎప్పటికప్పుడు సూచిస్తూ ఉంటారు.ప్ర‌తి రోజు గంట పాటు వ్యాయామం చేస్తే శరీర బరువు అదుపులో ఉంటుంది.మధుమేహం బారిన పడకుండా ఉంటారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.

Advertisement

చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది.ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.

ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్యం ప్రయోజనాలను తమ సొంతం చేసుకోవచ్చు.జీవితాన్ని ఎంతో హాయిగా మరియు ఆరోగ్యంగా జీవించవచ్చు.

కాబట్టి తప్పకుండా వ్యాయామాన్ని మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి.హెల్తీగా, ఫిట్ గా జీవించండి.

తాజా వార్తలు