సంపూర్ణ నవగ్రహ దేవాలయం విశిష్టత ఏమిటో తెలుసా?

సాధారణంగా నవగ్రహాలు మనకు ఎక్కువగా శివాలయం లో కనిపిస్తాయి.అయితే ఆలయ ఆవరణంలో కేవలం ఒక మండపంలో మాత్రమే ఈ నవగ్రహలు మనకు దర్శనమిస్తాయి.

అయితే ఈ మండపంలో కేవలం మనకు 9 గ్రహాలు దర్శనమివ్వడం చూస్తుంటాము.కానీ శివాలయంలో మాత్రం దేశంలో ఎక్కడా లేనివిధంగా నవ గ్రహాల కూటమి ఏర్పడి సంపూర్ణ నవగ్రహ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.

మరి ఈ సంపూర్ణ నవగ్రహ దేవాలయం ఎక్కడ ఉంది? ఆలయంలోని నవగ్రహాల విశిష్టత ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.తెలంగాణ రాష్ట్రంలోని, మెదక్ జిల్లా, తొగుట మండలం, రాంపూర్ గ్రామంలోని శ్రీ గురు మదనానంద శారదాపీఠం ఉంది.

ఆ పీఠంలో సంపూర్ణ నవగ్రహ ఆలయం ఉంది.అన్ని ఆలయాలలో మాదిరిగా కాకుండా ఈ ఆలయంలో నవగ్రహాలు ఎంతో ప్రత్యేకమైనవి.ఈ నవగ్రహాలలో ప్రతి గ్రహానికి ఆదిదేవుడు, ప్రత్యర్థిదేవతలు, దిక్పాలకుల సహితంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.

Advertisement
Did You Know Abou Navagraha Temple Navagraha Temple, Indian Temples, Hindu Templ

ఈ ఆలయంలో ప్రవేశించగానే మనకు మొత్తం 64 మంది దేవతామూర్తులు దర్శనమిస్తారు.ఈ విధంగా ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించిన దేవతలు ఈ ఆలయంలో కొలువై ఉండటం వల్ల సంపూర్ణ నవగ్రహ దేవాలయం అని పిలుస్తారు.

Did You Know Abou Navagraha Temple Navagraha Temple, Indian Temples, Hindu Templ

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉన్నటువంటి స్పటిక లింగం దర్శనమిస్తుంది.కోటి సైకత లింగాల్ని చేసి వాటిపై ఈ శివలింగాన్ని ప్రతిష్టించారు.ఈ ఆలయంలో కొలువై ఉన్న స్పటిక లింగాన్ని బావని చంద్రమౌళీశ్వరుడిగా కొలుస్తారు.

ఈ ఆలయానికి ఎక్కువగా గ్రహస్థితిలో దోషాలున్నవారు, కాలసర్ప దోషాలు ఉన్నవారు, సంతానం లేనివారు ఎక్కువగా ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సంపూర్ణ నవగ్రహ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాలలో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి సందర్శించి స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు