KTR Minister Jagdish Reddy : ఆ మంత్రికి రావాల్సిన క్రెడిట్ ను కేటీఆర్ కొట్టేశారా?

మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అనూహ్యంగా విజయం సాధించింది.వెయ్యి ఓట్లు మెజారిటీతో విజయాన్ని దక్కించుకుంది.

అయితే ఈ విజయం దక్కడం వెనుక టిఆర్ఎస్ అగ్ర నేతలు నుంచి,  కార్యకర్తల వరకు అంత సమిష్టి గానే పనిచేశారు.నియోజకవర్గానికి మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇతర కీలక ప్రజాప్రతినిధులను మండలాలు, గ్రామాల వారిగా, ఇన్చార్జీలుగా కేసీఆర్ నియమించారు.

ప్రతి గడపను,  ప్రతి పల్లెను దర్శించి టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి , రాబోయే రోజుల్లో మునుగోడుకు ఏ విధమైన అభివృద్ధి ఫలాలు తీసుకొస్తామనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని కెసిఆర్ ఆదేశించారు.దానికి అనుగుణంగానే ఇన్చార్జిలుగా బాధ్యతలు తీసుకున్న వారంతా పనిచేయడంతో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా.

టిఆర్ఎస్ వైపు ప్రజలు మొగ్గు చూపించారు.అయితే పూర్తిగా ఈ నియోజకవర్గానికి ఇన్చార్జిగా మంత్రి జగదీష్ రెడ్డిని కెసిఆర్ నియమించారు.

Advertisement

జగదీష్ రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగానే పూర్తి చేశారు.మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గడపను , ప్రతి పల్లెను సందర్శించి టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి , రాబోయే రోజుల్లో మునుగోడును ఏ విధంగా అభివృద్ధి చేస్తాము అనే విషయాన్ని జగదీశ్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.అలాగే ఎక్కడికక్కడ నియోజకవర్గంలోని కీలక నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఏకతాటిపైకి తీసుకువచ్చి , టిఆర్ఎస్ విజయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు.

అయితే అనుకున్నట్లుగానే మునుగోడు ఎన్నికల ఫలితం టిఆర్ఎస్ కు అనుకూలంగా వెలువడింది .ఈ విజయం తాలూకా క్రెడిట్ మొత్తం మంత్రి,  టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖాతాలో పడడం ఇప్పుడు చర్చినియాంశంగా మారింది.మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధిస్తే.

సిరిసిల్ల మాదిరిగానే ఈ నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. 

ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి పెద్ద ఎత్తున అభివృద్ధి చోటు చేసుకునే విధంగా చేస్తానని,  పూర్తిగా బాధ్యత తనదని కేటీఆర్ చెప్పారు.దానికి అనుగుణంగానే మునుగోడు ఎన్నికల ఫలితం వెలువడటంతో , ఈ క్రెడిట్ మొత్తం కేటీఆర్ ఖాతాలో పడింది.ఎన్నికల ఫలితం  వెలువడిని వెంటనే కేటీఆర్ ఫోటోలకు పాలాభిషేకం చేయడం, పూర్తిగా కేటీఆర్ వల్లనే మునుగోడు విజయం సాధ్యం అయిందనే విధంగా ప్రచారం తెరపైకి రావడంతో,  ముందు నుంచి కష్టపడిన జగదీష్ రెడ్డి కి ఆ క్రెడిట్ దక్కలేదు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ప్రియ శిష్యుడిగా పేరుపొందిన జగదీశ్ రెడ్డి పార్టీ ఆవిర్భావ కాలం నుంచి కేసీఆర్ అంటే నడుస్తున్నారు .టిఆర్ఎస్ చేపట్టిన తెలంగాణ ఉద్యమంలోనూ జగదీశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఉద్దండ నేతగాను ఆయన గుర్తింపు పొందారు.

Advertisement

నల్గొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుంటూ 12 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు.జగదీష్ రెడ్డి కృషి ఎక్కువగా ఉండడమే మునుగోడు విజయంలో కీలక పాత్ర పోషించేందుకు సాధ్యం అయ్యింది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి టీఆర్ఎస్ శ్రేణుల నుంచి.

తాజా వార్తలు