దేవి శ్రీప్రసాద్ కలర్స్ స్వాతిని అంతలా ఇబ్బంది పెట్టారా.. బయటపడిన అసలు విషయం?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

స్వాతి అంటే బహుశా ఈమెను గుర్తుపట్టకపోవచ్చు గాని కలర్స్ స్వాతి అంటే అందరికీ టక్కున ఈమె గుర్తుకు వస్తారు.

కలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి స్వాతి ఎంతో మంది దర్శక నిర్మాతల చూపును తన వైపుకు తిప్పుకుంది.ఈ క్రమంలోనే ఈమెకు వెండితెరపై నటించే అవకాశాలు కూడా వచ్చాయి.

ఇలా వెండితెరపై హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యారు.యాంకర్ గా నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా కలర్స్ స్వాతి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అద్భుతమైన గాత్రం ఉన్న ఈమెను సింగర్ గా పరిచయం చేయాలని దేవిశ్రీప్రసాద్ ఎన్నో ప్రయత్నాలు చేశారట.ఈ క్రమంలోనే సుకుమార్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఓ సినిమాలో పాట పాడటం కోసం దేవిశ్రీప్రసాద్ కలర్స్ స్వాతిని ఎంతగానో బ్రతిమాలారని తెలుస్తోంది.

Advertisement
Did Devi Sriprasad Colors Trouble Swati So Much The Real Thing That Came Out , D

అయితే తనకు పాట పాడటం ఇష్టం లేకపోవడంతో వరుస మెసేజ్ లు చేస్తూ తనని ఇబ్బంది పెట్టారట.

Did Devi Sriprasad Colors Trouble Swati So Much The Real Thing That Came Out , D

ఈ విధంగా దేవి శ్రీ ప్రసాద్ కు కలర్ స్వాతి రెస్పాండ్ కాకపోవడంతో ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులను ఒప్పించి తన సినిమాలో పాట పాడే అవకాశాన్ని కల్పించినట్టు తెలుస్తోంది.ఇంతకీ కలర్ స్వాతి పాట పాడిన సినిమా ఏది ఏ పాట పాడారు అనే విషయానికి వస్తే ఈమె సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య తమన్నా జంటగా నటించిన 100% లవ్ సినిమాలో ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనే పాటను పాడారట.అప్పట్లో ఈ పాట ఎంతో హిట్ అయింది.

ఇక అప్పుడు జరిగిన ఈ సంఘటన గురించి తాజాగా ఈ విషయం బయటపడటంతో ఈ వార్త వైరల్ అవుతుంది.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు