Diabetic Patients Fasting : రంజాన్ సందర్భంగా షుగర్ పేషెంట్లు ఉపవాసం ఉంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!

రంజాన్( Ramzan ) సమయంలో డయాబెటిక్ పేషెంట్లు( Diabetic Patients ) కూడా ఉపవాసం చేస్తే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే డయాబెటిక్ పేషెంట్లు సరైన డైట్ పాటించకపోతే హాస్పిటల్ లో అడ్మిన్ కావాల్సి ఉంటుంది.

ఉపవాసం( Fasting ) చేయడం తప్పు కాదు కానీ దానికి మీ ఆరోగ్యం సహకరించాలని కూడా గుర్తించుకోవాలి.మార్చి 12 నుండి రంజాన్ మాసం ప్రారంభమైంది.

ఇస్లాం మతంలో ఈ 30 రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.ఈ సమయంలో రోజు ఉపవాసం పాటించాలి.

అయితే అనారోగ్యంతో ఉంటే దీన్ని చేయవలసిన అవసరం లేదు.

Advertisement

కానీ చాలామంది డయాబెటిక్ పేషెంట్లు కూడా ఉపవాసం ఉంటున్నారు.ఇలాంటి వారు ఎలాంటి డైట్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.మీరు ఎప్పుడు రాజీపడకుడని విషయాలలో ఒకటి నిద్ర.

ముఖ్యంగా ఉపవాస సమయంలో తగినంత నిద్ర( Sleep ) చాలా అవసరం.ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

దీనివలన జీర్ణ సమస్యలు తలెత్తవు.ఉపవాస ముండే మధుమేహ వ్యాధిగ్రస్తులు డిహైడ్రేషన్ కు( Dehydration ) గురవడం ఒక ప్రమాదం.

కాబట్టి నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, పుచ్చకాయ, తక్కువ చక్కెరతో తాజా పండ్ల రసం, రోజ్ సిరప్ తరచుగా తీసుకోవాలి.

నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే
మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్...

దీంతో రోజంతా శరీరంలో నీటి కొరత ఉంటుంది.భోజనం చేసిన తర్వాత ఒక చెంచా పెరుగు ( Curd ) తీసుకోవాలి.ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.

Advertisement

ఇక ఉపవాస సమయంలో అసిడిటీ అవకాశాలను కూడా తగ్గిస్తుంది.ఇఫ్తార్ సమయంలో చక్కెర రహిత హైడ్రేటింగ్ డ్రింక్స్ తాగండి.

ఆ తర్వాత రాత్రి భోజనానికి వెళ్లాలి.సమోసా, కబాబ్, పూరి వంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను అస్సలు తినకూడదని గుర్తించుకోవాలి.

ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, స్కిన్లెస్ చికెన్, ఫిష్ లాంటి మాంసాన్ని తీసుకోవాలి.

తాజా వార్తలు