సినిమాలను కూడా వదిలి పెట్టని ధోనీ

టీం ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఆటలతో పాటు వ్యాపారాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్న విషయం తెల్సిందే.

పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉండటంతో పాటు, కొన్ని గేమింగ్‌ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెల్సిందే.

అందు కలడు ఇందు లేడు అన్నట్లుగా ఉంది ధోని పరిస్థితి.ఆయన ఇప్పటికే డజనుకు పైగా బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

అన్ని మార్గాల ద్వారా తన క్రేజ్‌ను వినియోగించుకుని డబ్బు చేస్తున్న ధోనీ త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇప్పటికే తన బయోపిక్‌ సినిమాగా తీసేందుకు అనుమతించడం ద్వారా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ధోనీ ఆ చిత్రంతో భారీ మొత్తంలో డబ్బు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక త్వరలో నేరుగా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.సినిమాల్లోకి అంటే ధోనీ నటించడం కాదు.

Advertisement

ధోని త్వరలోనే ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నాడు.బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహంతో కలిసి ధోనీ ప్రొడక్షన్‌ హౌస్‌కు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

జాన్‌ అబ్రహం బాలీవుడ్‌లో స్టార్‌ హీరో.ఈయనతో ధోనీకి చాలా కాలంగా మంచి స్నేహితం ఉంది.అందుకే స్నేహితులు ఇద్దరు కలిసి వ్యాపారం చేసేందుకు సిద్దం అవుతున్నారు.

అతి త్వరలోనే ఈ విషయమై అధికారికంగా ప్రకటన రాబోతుంది.ధోనీ ప్రొడక్షన్స్‌లో చిన్న బడ్జెట్‌ కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు రాబోతున్నాయి.

అలాగే వెబ్‌ సిరీస్‌లను కూడా నిర్మించే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి మహేంద్ర సింగ్‌ ధోనీ మరో కొత్త రంగంలోకి అడుగు పెట్టబోతున్నాడు.

మనిషి చివరి క్షణాలలో.. ఈ వస్తువులు దగ్గర్లో ఉంటే స్వర్గం ఖాయం..!

అది సినిమాలు అవ్వడంతో ఆయన అభిమానులు సంతోషంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు